రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
దిశ, వెబ్ డెస్క్: ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్ ల వెకేషన్ బెంచ్ దీని పై విచారణ చేపట్టింది. అయితే ఈ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ పై విచారణను మధ్యాహనం,12 గంటలకు అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ విచారణలో కేంద్రప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కావాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రఘురామకృష్ణరాజు తరుపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ […]
దిశ, వెబ్ డెస్క్: ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్ ల వెకేషన్ బెంచ్ దీని పై విచారణ చేపట్టింది. అయితే ఈ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ పై విచారణను మధ్యాహనం,12 గంటలకు అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ విచారణలో కేంద్రప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కావాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
రఘురామకృష్ణరాజు తరుపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరఫున దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. అయితే బెయిల్ తో పాటు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు అనుమతివ్వాలని రోహత్గి కోర్టును కోరారు. కస్టడీలో ఎంపీనీ పోలీసులు కొట్టారని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనను పరీక్షించేలదని పేర్కొన్నారు. శుక్రవారానికి కేసును వాయిదా వేస్తే సమాధానమిస్తామన్న ఏపీసీఐడీ లాయర్ దుశ్యంత్ దవే కోర్టుకు తెలిపారు. ఈ విచారణను మధ్యాహనం 12 గం. కోర్టు వాయిదా వేసింది. ఈలోగా సంబంధిత డాక్యుమెంట్లను ఆన్ లైన్ ద్వారా కోర్టుకు అందించాలని ధర్మాసనం ఆదేశించింది.