కరోనా ప్రభావిత ప్రాంతాల దిగ్బంధం

దిశ, మహబూబ్‌‌నగర్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలతో పాటు వాటి సరిహద్దు ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఇనుప కంచెలతో బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని కొంతమంది ఎంత చెప్పినా వినకుండా నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నట్టు గుర్తించారు. అలాగే గతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లనూతొలగించి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం […]

Update: 2020-04-23 21:07 GMT

దిశ, మహబూబ్‌‌నగర్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలతో పాటు వాటి సరిహద్దు ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఇనుప కంచెలతో బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని కొంతమంది ఎంత చెప్పినా వినకుండా నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నట్టు గుర్తించారు. అలాగే గతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లనూతొలగించి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం తాము చేస్తున్న పనులకు ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. అదే సమయంలో శుక్రవారం నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నామని, ఉదయం 10 గంటల తరువాత ఎవరైనా బయట తిరుగుతున్నట్టు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Tags : Quarantine, corona, affected areas, mahaboobnagar, police

Tags:    

Similar News