40 స్క్రీన్‌ల కోసం రూ. 150 కోట్ల పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40 స్క్రీన్‌లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. దీనికోసం రూ. 150 కోట్ల పెట్టుబడులను పెట్టాలని భావిస్తోంది. రాబోయే కొన్నేళ్లలో 1,000 స్క్రీన్‌లను ప్రారంభించేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ కరోనా కారణంగా ఇది ఏడాది ఆలస్యం అవుతోందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వెయ్యి కొత్త స్క్రీన్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా ఉన్నామని పీవీఆర్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40 స్క్రీన్‌లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. దీనికోసం రూ. 150 కోట్ల పెట్టుబడులను పెట్టాలని భావిస్తోంది. రాబోయే కొన్నేళ్లలో 1,000 స్క్రీన్‌లను ప్రారంభించేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ కరోనా కారణంగా ఇది ఏడాది ఆలస్యం అవుతోందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వెయ్యి కొత్త స్క్రీన్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా ఉన్నామని పీవీఆర్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమారు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 30-40 కొత్త స్క్రీన్‌లను పీవీఆర్ తీసుకురానుంది. ప్రస్తుతం పీవీఆర్ 71 నగరాల్లో 844 స్క్రీన్‌లను నిర్వహిస్తోందని సంజీవ్ వివరించారు.
‘కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కార్యకలాపాలు, ఆదాయం మిశ్రమంగా ఉంది. మరికొద్దిరోజుల్లో ఇది పుంజుకుంటుందని ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు సంజీవ్ అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా మల్టీప్లెక్స్ పరిశ్రం తీవ్రంగా ప్రభావితమైంది. కరోనా నిబంధనలను పాటించడం, ప్రజల్లో ఆందోళనలు ఉండటంతో నష్టాలను ఎదుర్కొన్నామని సంజీవ్ పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పీవీఆర్ సంస్థ రూ. 49.10 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 36.34 కోట్ల లాభాలను దక్కించుకుంది.