ఉత్తేజ్.. వేలమందితో సమానం: పూరి
నటుడు, రచయిత ఉత్తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఎవరు.. ఎలా.. ఎంత గొప్పగా విష్ చేసినా ఆప్తుల నుంచి వచ్చే స్పెషల్ విష్ ఇచ్చే కిక్కే వేరు. అలాంటి ప్రత్యేకమైన శుభాకాంక్షలను దర్శకుడు పూరీ జగన్నాథ్ నుంచి అందుకున్నారు ఉత్తేజ్. కల్మషం లేని నవ్వుతో ఉన్న ఉత్తేజ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన పూరి ‘ఒక నమ్మకమైన మిత్రుడు వేలాదిమంది కన్నా విలువైనవాడు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. 1989లో మొదలైన మా […]
నటుడు, రచయిత ఉత్తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఎవరు.. ఎలా.. ఎంత గొప్పగా విష్ చేసినా ఆప్తుల నుంచి వచ్చే స్పెషల్ విష్ ఇచ్చే కిక్కే వేరు. అలాంటి ప్రత్యేకమైన శుభాకాంక్షలను దర్శకుడు పూరీ జగన్నాథ్ నుంచి అందుకున్నారు ఉత్తేజ్. కల్మషం లేని నవ్వుతో ఉన్న ఉత్తేజ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన పూరి ‘ఒక నమ్మకమైన మిత్రుడు వేలాదిమంది కన్నా విలువైనవాడు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. 1989లో మొదలైన మా స్నేహం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే గొప్పగా కొనసాగుతోందన్న ఈ మాస్ డైరెక్టర్ ‘నేను గర్వంగా చెప్పగలను, నాకొక స్నేహితుడున్నాడు. తనే ఉత్తేజ్. హ్యాపీ బర్త్ డే డార్లింగ్. మిస్ యూ అండ్ లవ్ యూ ఆల్వేస్’ అంటూ విష్ చేశారు పూరి. ఈ పిక్‌ను ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేసిన నటి, నిర్మాత చార్మి కౌర్ ‘హ్యాపీ బర్త్‌డే బావ’ అంటూ స్వీట్ విష్ చేసింది.
One loyal friend is worth than a thousand.
Our friendship began in 1989 n since then till now I can proudly say , I have a friend n that is Uttej ..
happy birthday to u darling . Miss u and love u always ❣️❣️❣️ pic.twitter.com/saRx2lLolc— PURIJAGAN (@purijagan) June 2, 2020