వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరం: నందమూరి సుహాసిని
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. శాసనసభలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం సందర్భంలో.. తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భువనేశ్వరికి ఎన్టీఆర్ కుటుంబం సంఘీభావం తెలిపింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని నందమూరి సుహాసిని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. శాసనసభలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం సందర్భంలో.. తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భువనేశ్వరికి ఎన్టీఆర్ కుటుంబం సంఘీభావం తెలిపింది.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని నందమూరి సుహాసిని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు. తెలుగు ప్రజలందరూ చంద్రబాబు వెంటే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.