సిగరెట్ పీకలతో మస్కిటో కాయిల్స్

దిశ, ఫీచర్స్: వాడిపడేసిన ఏ వస్తువు కూడా పనికిరాదని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రతీ వస్తువును రీసైకిల్ చేసి ఏదోవిధంగా రీయూజ్ చేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్, కంపోస్ట్ ఎరువును తయారుచేస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి.. తాగిపడేసిన సిగరెట్ పీకల‌ను రీసైకిల్ చేసి బొమ్మలు, మస్కిటో కాయిట్స్ వంటివి రూపొందిస్తున్నాడు. నిజానికి సిగరెట్ ఫిల్టర్లు భూమిలో కలిసిపోవడానికి 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నందున […]

Update: 2021-09-13 10:37 GMT

దిశ, ఫీచర్స్: వాడిపడేసిన ఏ వస్తువు కూడా పనికిరాదని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రతీ వస్తువును రీసైకిల్ చేసి ఏదోవిధంగా రీయూజ్ చేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్, కంపోస్ట్ ఎరువును తయారుచేస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి.. తాగిపడేసిన సిగరెట్ పీకల‌ను రీసైకిల్ చేసి బొమ్మలు, మస్కిటో కాయిట్స్ వంటివి రూపొందిస్తున్నాడు. నిజానికి సిగరెట్ ఫిల్టర్లు భూమిలో కలిసిపోవడానికి 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నందున ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమై వాటితో వస్తువులు తయారుచేస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నాడు.

మొహాలీకి చెందిన ట్వింకిల్ కుమార్ అనే ఎంట్రప్రెన్యూర్.. కరోనా లాక్‌డౌన్ కారణంగా గతేడాది ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఏదైనా క్రియేటివ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ, కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసిన తర్వాత సిగరెట్ పీకల రీసైక్లింగ్ ప్లాంట్‌ను నెలకొల్పాలని డిసైడ్ అయ్యాడు. అప్పటికే ఇదే బిజినెస్‌లో ఉన్న కంపెనీని ఆశ్రయించి, రీసైక్లింగ్ ప్రాసెస్‌తో పాటు వస్తువులు తయారుచేసే పద్ధతి నేర్చుకున్నాడు. ఆ తర్వాత మొహాలీలోనే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇక మెటీరియల్(సిగరెట్ బట్స్) సేకరణతో పాటు వాటి ప్రాసెసింగ్, కన్వర్షన్ కోసం స్థానిక మహిళలను నియమించుకున్నాడు. ఇదే క్రమంలో సిగరెట్ పీకల కలెక్షన్ కోసం కుమార్ అండ్ టీమ్ నగరంలోని పలు స్మోకింగ్ జోన్ల వద్ద డబ్బాలు ఏర్పాటు చేశారు.

‘సిటీలోని పబ్లిక్ ప్లేసెస్‌లో గల స్మోకింగ్ జోన్ల వద్ద డబ్బాలను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సిగరెట్ బట్స్ సేకరిస్తు్న్నాం. ఆ తర్వాత ఫిల్టర్‌ను కెమికల్‌ ప్రాసెస్ ద్వారా శుభ్రపరిచి, వాటి నుంచి టాక్సిక్ పార్ట్స్‌ను తొలగిస్తాం. ఫైనల్‌గా వాటిని బొమ్మలు, కుషన్లతో పాటు మస్కిటో రెపిల్లెంట్స్‌గా ఉపయోగిస్తాం’ అని కుమార్ తెలిపాడు.

Tags:    

Similar News