వన్డే సిరీస్‌లో ప్రేక్షకులకు అనుమతి లేదు

దిశ, స్పోర్ట్స్: కరోనా కేసులు మహారాష్ట్రలో పెరిగిపోతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌తో పాటు, ఆ తర్వాత జరగాల్సిన ఐదు టీ20 మ్యాచ్‌లు కూడా అహ్మదాబాద్‌లోని మొతేరాలోనే జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో ప్రేక్షకులను అనుమతించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకొని, ఆ మేరకు టికెట్లు కూడా అమ్మేశారు. అయితే టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ మొత్తం పూణేలో జరుగనున్నది. ఆ మూడు మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. తొలుత […]

Update: 2021-02-27 10:05 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా కేసులు మహారాష్ట్రలో పెరిగిపోతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌తో పాటు, ఆ తర్వాత జరగాల్సిన ఐదు టీ20 మ్యాచ్‌లు కూడా అహ్మదాబాద్‌లోని మొతేరాలోనే జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో ప్రేక్షకులను అనుమతించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకొని, ఆ మేరకు టికెట్లు కూడా అమ్మేశారు. అయితే టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ మొత్తం పూణేలో జరుగనున్నది. ఆ మూడు మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. తొలుత మహారాష్ట్ర ప్రభుత్వం వన్డే మ్యాచ్‌లను అనుమతించడం లేదని వార్తలు వచ్చినా.. బీసీసీఐ ఖండించింది. మ్యాచ్‌లు షెడ్యూల్ మేరకు పూణేలోనే జరుగుతాయని.. కాకపోతే ప్రేక్షకులను మాత్రం అనుమతించబోవడం లేదని స్పష్టం చేసింది. దీంతో వన్డే మ్యాచ్‌లపై ఉన్న సందిగ్దత తొలిగిపోయింది.

Tags:    

Similar News