పులిచింతల ప్రాజెక్ట్ గేటు మరమ్మతులు వేగవంతం
దిశ, ఏపీ బ్యూరో : పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరమ్మతుల పనులను వేగవంతం చేశారు. గేటు కొట్టుకపోయిన ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీలో కూడా ఈ అంశంపై చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు వద్ద స్టాక్ లాక్ గేట్ అమర్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. సాగర్, తుపాకులగూడెం, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణులు, 35 మంది […]
దిశ, ఏపీ బ్యూరో : పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరమ్మతుల పనులను వేగవంతం చేశారు. గేటు కొట్టుకపోయిన ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీలో కూడా ఈ అంశంపై చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు వద్ద స్టాక్ లాక్ గేట్ అమర్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
సాగర్, తుపాకులగూడెం, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణులు, 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో నిపుణుల బృందం మరమ్మతుల పనులు చేపట్టింది. ఇదిలా ఉంటే గురువారం పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు రెండు అడుగుల మేరు గేట్లను ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే.