‘పుచ్చలపల్లి’ని అవమానించడం తగదు..

దిశ, ఏపీబ్యూరో: మార్క్సిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య స్మారకార్థం ఏర్పాటు చేయనున్న పార్కు స్థలాన్ని సచివాలయం కోసం తీసుకోవడం తగదని ఆయన అభిమానులు ప్రభుత్వానికి సూచించారు. సుందరయ్య సొంతూరు నెల్లూరు జిల్లా విడవలూరులో గత ప్రభుత్వం ఆయన పేరుతో పార్కు నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణం ఆగిపోయింది. ప్రస్తుతం ఆ స్థలంలో ప్రభుత్వం సచివాలయం నిర్మించడానికి సిద్ధమైంది. దీంతో శుక్రవారం స్థానికులు ఆందోళనకు దిగారు. నిరంతర పోరాటాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన పుచ్చలపల్లి సుందరయ్యను […]

Update: 2020-10-30 10:53 GMT

దిశ, ఏపీబ్యూరో: మార్క్సిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య స్మారకార్థం ఏర్పాటు చేయనున్న పార్కు స్థలాన్ని సచివాలయం కోసం తీసుకోవడం తగదని ఆయన అభిమానులు ప్రభుత్వానికి సూచించారు. సుందరయ్య సొంతూరు నెల్లూరు జిల్లా విడవలూరులో గత ప్రభుత్వం ఆయన పేరుతో పార్కు నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణం ఆగిపోయింది.

ప్రస్తుతం ఆ స్థలంలో ప్రభుత్వం సచివాలయం నిర్మించడానికి సిద్ధమైంది. దీంతో శుక్రవారం స్థానికులు ఆందోళనకు దిగారు. నిరంతర పోరాటాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన పుచ్చలపల్లి సుందరయ్యను ప్రభుత్వం అవమానించడం తగదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ ​చేశారు.

Tags:    

Similar News