అర్వింద్, రేవంత్‌లు బద్మాష్ ఎంపీలు : జీవన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎంపీ అర్వింద్ అని.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడక పోతే ప్రజలే గోరీ కడతారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే ఆర్మూర్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అర్వింద్ఒక సైకో, డ్రగ్ అడిక్ట్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరువునష్టం కేసులు పెడుతామని […]

Update: 2021-10-20 06:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎంపీ అర్వింద్ అని.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడక పోతే ప్రజలే గోరీ కడతారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే ఆర్మూర్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అర్వింద్ఒక సైకో, డ్రగ్ అడిక్ట్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరువునష్టం కేసులు పెడుతామని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎం కేసీఆర్ ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని, అసలు ఈసీఐ ఉన్నది కేంద్రం పరిధిలోనే అనే విషయం తెలియదా అని ప్రశ్నించారు.

ఎంపీగా గెలిచిన 5 రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానన్న అర్వింద్ నేటికీ 911 రోజులు అయినా తేలేదని మండిపడ్డారు. నేటికీ గుజరాత్‌లో ఇంటింటికీ నల్లా మంచినీరు రావడం లేదని, తెలంగాణలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరందిస్తున్నామన్నారు. కవితపై సింగిల్ వర్డుతో విమర్శలు చేస్తే నిజామాబాద్ జిల్లాలో మహిళలంతా అర్వింద్‌ను చెప్పులతో కొడుతారన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన మధుయాష్కీకి డిపాజిట్లు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

మంత్రి కేటీఆర్‌తో పోల్చుకునే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఎంపీ అర్వింద్ స్టంట్ మాస్టర్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ టెంట్ మాస్టరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటున్న రేవంత్ డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. బద్మాష్ ఎంపీలు అరవింద్, రేవంత్‌లకు త్వరలోనే ప్రజలు బుద్దిచెబుతారన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, 30వేల ఓట్ల మెజారిటీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తరహాలో మేము ప్రవర్తిస్తే ఇప్పటికీ ప్రతిపక్ష నేతలపై 30 సార్లు దాడి చేసేవాళ్లమని, పార్టీ భవనాలు కూల్చేవాళ్లమని, కానీ మాకు క్రమశిక్షణ ఉందన్నారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడొద్దని ఒక ఎంపీకి కోర్టు ఆదేశాలిచ్చినప్పుడు మరో ఎంపీ మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. బూతు మాటలకు పేటెంట్ తీసుకున్నట్టుగా అర్వింద్, రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరాయి వాళ్లకు పైసల సంచులు మోయడం… సమావేశాల పేరుతో సంచులు నింపుకోవడం తప్ప రేవంత్‌కు ఏదీ చేతకాదన్నారు. ముందస్తుపై చిలక జోస్యాలు చెబుతున్న రేవంత్ అదే వృత్తిలో శాశ్వతంగా స్థిరపడే రోజూ ఎంతో దూరంలో లేదని సెటైర్లు వేశారు. రేవంత్ తెలంగాణకే కాదు కాంగ్రెస్‌కు కూడా దుఃఖ దాయకుడన్నారు.

అర్వింద్ అడ్డగోలుగా సంపాందించిన డబ్బు పొగరుతో మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. అర్వింద్ ఇంటి పరిస్థితులనే చక్కదిద్దుకోనోడని, అలాంటిది ఇతర కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం ఎందుకని ప్రశ్నించారు. అర్వింద్ చీటర్ అని బండి సంజయే సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. మేము ముగ్గురం… మాకు మూడు పార్టీలు అన్నచందంగా మారింది డీఎస్ కుటుంబం అని ఆరోపించారు.

తండ్రి టీఆర్ఎస్ ఎంపీ, కొడుకు బీజేపీ ఎంపీ, ఇంకో కొడుకు కాంగ్రెస్.. మేము ఇచ్చే ఎంపీ పింఛన్‌‌తోనే బియ్యం కొనుక్కొని తింటున్నారని ఎద్దేవా చేశారు. మా ఎజెండా అభివృద్ధి, సంక్షేమం అన్నారు. టెలీవిజన్ లీడర్లు ప్రతిపక్ష నాయకులన్నారు. ఈ సమావేశంలో మదర్ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపు పాల్గొన్నారు.

Tags:    

Similar News