'ఈ చెత్త పంచాయితీని.. మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించట్లేదు'

దిశ, ఖమ్మం టౌన్: తాము ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదంటూ ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ బీసీ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది పక్కనే ఉన్న ధన్వాయిగూడెంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో చెత్తను తగులబెట్టడంతో వస్తున్న పొగ అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడంతో కార్పొరేషన్ సిబ్బందిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సీఐ శ్రీధర్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి ప్రజలతో మాట్లాడి […]

Update: 2021-12-17 21:33 GMT

దిశ, ఖమ్మం టౌన్: తాము ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదంటూ ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ బీసీ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది పక్కనే ఉన్న ధన్వాయిగూడెంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో చెత్తను తగులబెట్టడంతో వస్తున్న పొగ అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడంతో కార్పొరేషన్ సిబ్బందిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సీఐ శ్రీధర్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి ప్రజలతో మాట్లాడి పారిశుద్ధ్య సిబ్బందిని, చెత్త ట్రాక్టర్లను వెనిక్కి పంపించారు.

తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు రాత్రి 10.30 వరకు రోడ్లపై ధర్నా నిర్వహించారు. గత మూడేళ్లుగా తాము డంపింగ్ వ్యర్థాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీ సగం పాలేరు నియోజకవర్గం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఒకటో డివిజన్, 56వ డివిజన్ లో మరోసగం ఉండడంతో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఇటు మంత్రి పువ్వాడ అజయ్ ల దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్య పరిష్కరించేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి, అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News