పబ్‌జీ ప్రియులకు గుడ్‌న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: పబ్‌జీ గేమ్ ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ‘‘పబ్‌జీ మొబైల్ ఇండియా’’గా రాబోతున్న పబ్‌జీ న్యూ టీజర్‌ను పబ్‌జీ కార్పొరేషన్ లాంచ్ చేయనుంది. పబ్ జీ ప్రియులకు మరో గుడ్ న్యూస్ అదేంటంటే.. భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌లో చైనాకు సంబంధించిన అనేక యాప్స్‌ను నిషేధించారు. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్, పబ్‌జీ యాప్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా 117 యాప్‌ల మీద భారత్ ప్రభుత్వం ఆగస్టులో నిషేధం విధించింది. పబ్‌జీ […]
దిశ, వెబ్‌డెస్క్: పబ్‌జీ గేమ్ ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ‘‘పబ్‌జీ మొబైల్ ఇండియా’’గా రాబోతున్న పబ్‌జీ న్యూ టీజర్‌ను పబ్‌జీ కార్పొరేషన్ లాంచ్ చేయనుంది. పబ్ జీ ప్రియులకు మరో గుడ్ న్యూస్ అదేంటంటే..
భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌లో చైనాకు సంబంధించిన అనేక యాప్స్‌ను నిషేధించారు. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్, పబ్‌జీ యాప్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా 117 యాప్‌ల మీద భారత్ ప్రభుత్వం ఆగస్టులో నిషేధం విధించింది. పబ్‌జీ కొరియాకు చెందిన కంపెనీ కాగా, మొబైల్ వర్షన్ గేమ్ బాధ్యతల్ని మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్‌కు అప్పగించింది. భారత్‌లో బ్యాన్ విధించిన తర్వాత టెన్సెంట్ పబ్‌జీ నుంచి తప్పుకుంది.
దాంతో ఈసారి ఇండియాలోని ఆటగాళ్ల గోప్యత, భద్రతను కాపాడటానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో పబ్‌జీ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే పబ్‌బీ తిరిగి ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ కాగా, యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ క్రేజ్ చూస్తుంటేనే పబ్‌జీకి ఏ రేంజ్‌లో అభిమానులున్నారో తెలిసిపోతోంది. కొత్తగా తీసుకొచ్చిన పబ్‌జీ మొబైల్ ఇండియాలో భారత మార్కెట్‌కు తగ్గట్లుగా ఈ గేమ్‌ను కంపెనీ డిజైన్ చేస్తోంది.
ఇక పబ్ జీ గేమర్లకు గుడ్ న్యూస్ ఏంటంటే.. గతంలో ఏ గేమర్ ఐడీతో పబ్‌జీ ఆడారో, సేమ్ అదే ఐడీతో ప్రస్తుత ‘పబ్‌జీ మొబైల్ ఇండియా’కు లాగిన్ అవ్వొచ్చు. అంతేకాదు గతంలో పబ్‌జీ గేమర్ సాధించిన అచీవ్‌మెంట్స్, రివార్డ్స్, స్కిన్స్, అన్నీ కూడా క్యారీ ఫార్వార్డ్ అవుతాయని కంపెనీ వెల్లడించింది. పబ్‌జీ కార్పొరేషన్ పేరేంట్ కంపెనీ క్రాఫ్టన్, మైక్రోసాఫ్ట్‌తో కలిసి పబ్‌జీ మొబైల్ డేటా కోసం ‘మైక్రోసాఫ్ట్ అజుర్ క్లౌడ్ సర్వీస్’ను ఉపయోగించుకోనుంది. పబ్ జీ గేమ్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ‘కమింగ్ సూన్’ అని మాత్రమే కంపెనీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుంచి అవసరమైన అప్రూవల్స్, పర్మిషన్స్ అన్ని వస్తే , పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ విడుదల తేదీ తెలుస్తుంది.