ఆ గ్రామంలో సైకో టెన్షన్.. రక్తాన్ని తాగుతూ..

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా జ్యూస్‌లు, పాలు ఎక్కువగా ఇష్టంగా తాగుతారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా పశువుల రక్తాన్ని ఇష్టంగా తాగుతున్నాడు. రక్తాన్ని ఇష్టంగా తాగడం ఏంటీ అని ఆశ్చర్య పోతున్నారా.. మహబూబ్‌నగర్ జిల్లా సింగంపేటలో ఓ సైకో వ్యక్తి వీరంగం సృష్టిస్తున్నాడు. గ్రామంలోని ఏ పశువును వదల కుండా వాటి రక్తాన్ని పీల్చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాడు. గ్రామంలోని కమ్మరి రాజు అనే వ్యక్తి గతంలో మేకలు, గొర్రెల గొంతు కోసి వాటి రక్తం […]

Update: 2021-07-04 21:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా జ్యూస్‌లు, పాలు ఎక్కువగా ఇష్టంగా తాగుతారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా పశువుల రక్తాన్ని ఇష్టంగా తాగుతున్నాడు. రక్తాన్ని ఇష్టంగా తాగడం ఏంటీ అని ఆశ్చర్య పోతున్నారా.. మహబూబ్‌నగర్ జిల్లా సింగంపేటలో ఓ సైకో వ్యక్తి వీరంగం సృష్టిస్తున్నాడు. గ్రామంలోని ఏ పశువును వదల కుండా వాటి రక్తాన్ని పీల్చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాడు. గ్రామంలోని కమ్మరి రాజు అనే వ్యక్తి గతంలో మేకలు, గొర్రెల గొంతు కోసి వాటి రక్తం తాగేవాడు. దీంతో గ్రామస్తులందరూ కలసి అతన్ని ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించారు. అయితే అతను మూడు నెలలు చికిత్స తీసుకుని అనంతరం మళ్లీ గ్రామానికి వచ్చాడు. మారిపోయాడేమో అనుకున్న గ్రామస్తులకు షాక్ ఇస్తూ లేగదూడలను చంపి రక్తం తాగడం మొదలు పెట్టాడు. తాజాగా ఓ లేగ దూడను చంపి రక్తం తాగాడు. దీంతో గ్రామంలో సైకో టెన్షన్ మొదలైంది. ఎలాగైన ఆ సైకో నుంచి తమ పశువులను కాపాడాలంటున్నారు గ్రామస్తులు.

Tags:    

Similar News