కరోనా పేషెంట్లకు ‘సొరియాసిస్’మందు
న్యూఢిల్లీ: కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు అత్యవసర సమయాల్లో సొరియాసిస్ మందు ఇటోలిజుమాబ్ ఇవ్వడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతినిచ్చింది. తీవ్రస్థాయిలో శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్న కరోనా పేషెంట్లకు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరం మేరకు మందుల సదుపాయం లేని కారణంగా ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను కరోనా పేషెంట్లకు ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చినట్టు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వీజీ సోమని తెలిపారు. సైటోకీన్ విడుదల కోసం ఈ మందును వినియోగించడానికి […]
న్యూఢిల్లీ: కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు అత్యవసర సమయాల్లో సొరియాసిస్ మందు ఇటోలిజుమాబ్ ఇవ్వడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతినిచ్చింది. తీవ్రస్థాయిలో శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్న కరోనా పేషెంట్లకు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరం మేరకు మందుల సదుపాయం లేని కారణంగా ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను కరోనా పేషెంట్లకు ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చినట్టు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వీజీ సోమని తెలిపారు. సైటోకీన్ విడుదల కోసం ఈ మందును వినియోగించడానికి ఓకే చెప్పారు.
బయోకాన్‌కు చెందిన ఈ డ్రగ్ ఇప్పటి వరకు చర్మ సంబంధ సమస్య సొరియాసిస్ కోసం వాడుతున్నారు. ఈ మందును కరోనా పేషెంట్లకు ఇచ్చినప్పుడు సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు వైద్యనిపుణుల కమిటీ నిర్ధారించింది. సైటోకీన్ రిలీజ్ సిండ్రోమ్ కోసం సమర్థవంతంగా ఈ మందు పనిచేస్తున్నదని వివరించింది. ఈ మందు స్వీకరించేవారు ముందస్తుగానే పేషెంట్ అనుమతిని తీసుకోనున్నారని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం రెమ్‌డెసివిర్ సహా పలు మందులు కరోనా పేషెంట్లకు అత్యవసర సమయంలో ఇవ్వడానికి అనుమతి పొంది ఉన్న విషయం తెలిసిందే.