సేవా దృక్పథంతో సేవలు అందిచడం అభినందనీయం
దిశ, ఘట్కేసర్ : వైద్యో నారాయణ హరి.. అన్న విధంగా ప్రజలకు సేవా దృక్పథంతో వజ్ర ఆసుపత్రి యాజమాన్యం సేవలు అందించడం అభినందనీయం అని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి అన్నారు. వజ్ర ఆసుపత్రి 4వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ స్వీచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. స్థాపించిన కొద్ది కాలంలోనే […]
దిశ, ఘట్కేసర్ : వైద్యో నారాయణ హరి.. అన్న విధంగా ప్రజలకు సేవా దృక్పథంతో వజ్ర ఆసుపత్రి యాజమాన్యం సేవలు అందించడం అభినందనీయం అని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి అన్నారు. వజ్ర ఆసుపత్రి 4వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ స్వీచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. స్థాపించిన కొద్ది కాలంలోనే ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ప్రశంసలు పొందడం వైద్యుల పనితీరుకు నిదర్శనం అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మంచి పేరు ప్రతిష్టలు పొందాలని ఎండి. డా. జి. ప్రకాష్‌ను కోరారు.
జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్ రావు మాట్లాడుతూ.. కరోనా విపత్కర కాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడటం జరిగిందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు ముందుండాలన్నారు. త్యాగానంద సరస్వతి పీఠాధిపతి (చెంగిచర్ల )హాజరై ఆశీర్వదించారు. కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వజ్ర హాస్పిటల్ ఎం.డి. జి. ప్రకాష్ మాట్లాడుతూ.. సేవా దృక్పథంతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి చిన్న పిల్లలకు సంబంధించిన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భవిష్యత్ లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృజ్ఞతలు తెలిపారు. నూతన క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ బౌసింగ్ నాయక్, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, ఎస్ బిల్డర్ ఎండీ అభిలాష్ రెడ్డి, వైద్యులు అభిషేక్, ప్రశాంత్, రమేష్ నాయక్, మీనా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.