గ్రామాల్లో జోరుగా సాగుతున్న నిరసనలు.. గాడిదలపై ఊరేగిస్తూ..

దిశ, పరిగి: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచన మేరకు సోమవారం పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. పరిగి ఎమ్మెల్యే సోదరుడు కొప్పుల అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ అకరణం అరవింద్ రావు, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్ తదితరులు కలిసి నిరసన కార్యక్రామాలు ఇర్వహించారు. ఎమ్మెల్యే నివాసం నుండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా […]

Update: 2021-12-20 05:02 GMT

దిశ, పరిగి: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచన మేరకు సోమవారం పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. పరిగి ఎమ్మెల్యే సోదరుడు కొప్పుల అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ అకరణం అరవింద్ రావు, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్ తదితరులు కలిసి నిరసన కార్యక్రామాలు ఇర్వహించారు. ఎమ్మెల్యే నివాసం నుండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ హైవే రోడ్డు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైవే రోడ్డు 163 పరిగి బాహర్పేట్ చౌరస్తాలో గాడిదపై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను ఊరేగించారు. గాడిదకు వినతి పత్రం అందజేశారు. దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు, రైతు సమన్వయ సమితి పరిగి మండల కన్వీనర్ మేడిద రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సమీర్, కౌన్సిలర్లు వేముల కిరణ్ కుమార్ గుప్త, వారాల రవీంద్రా, వెంకటేష్, నాగేశ్వర్, రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్, హన్మంత్ రెడ్డి, మంగు సంతోష్, గౌస్, ఆసీప్, ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు. పరిగితోపాటు దోమ, పూడూరు, కుల్కచర్ల, చౌడాపూర్ విఠలాపూర్ సర్పంచ్ మల్లేష్ చౌడపూర్ సర్పంచ్ రంగారెడ్డి మంది పాల్ సర్పంచ్ ప్రమీల వీర పూర్ సర్పంచ్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News