బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హన్మకొండలో నిరసన
దిశ, హన్మకొండ చౌరస్తా: దేశవ్యాప్తంగా ప్రజలతో అనుబంధంగా ఉన్న బ్యాంకులను ప్రభుత్వాలు ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. గతకొన్ని రోజుల క్రితమే బ్యాంక్ ఉద్యోగ సంఘాలు రెండు రోజుల బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా గురువారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని అశోక జంక్షన్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ హోదా కలిగిన బ్యాంకులను ప్రైవేటు పరం […]
దిశ, హన్మకొండ చౌరస్తా: దేశవ్యాప్తంగా ప్రజలతో అనుబంధంగా ఉన్న బ్యాంకులను ప్రభుత్వాలు ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. గతకొన్ని రోజుల క్రితమే బ్యాంక్ ఉద్యోగ సంఘాలు రెండు రోజుల బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా గురువారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని అశోక జంక్షన్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ హోదా కలిగిన బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు నష్టం కలుగుతోందని అన్నారు. ఇప్పటికే వేలకోట్ల రూపాయల స్థిర-చర ఆస్తులు కల్గిన బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉదోగుల సమస్యలు నెరవేర్చి.. బ్యాంకుల ప్రైవేటీకరణను వెనెక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.