‘ప్రాణాలు పోతున్నా… ప్రభుత్వానికి పట్టదా?’
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నా.. రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తోందని ఖమ్మం సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఖమ్మ పట్టణంలోని 50 డివిజన్లలో నిరసన వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను చెల్లించని ప్రతీ కుటుంబానికి కేంద్రం బ్యాంకులో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతూనే […]
దిశ, ఖమ్మం: కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నా.. రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తోందని ఖమ్మం సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఖమ్మ పట్టణంలోని 50 డివిజన్లలో నిరసన వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను చెల్లించని ప్రతీ కుటుంబానికి కేంద్రం బ్యాంకులో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతూనే ప్రయివేటీకరణను మానుకోవాలన్నారు. సీపీఐ(ఎం) జాతీయ నాయకత్వ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు పార్టీ టూటౌన్ కార్యదర్శి వై.విక్రమ్ తెలిపారు.