రేపు రామన్నపేట ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి: సీపీఎం
దిశ, రామన్నపేట: రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ సమస్యల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 25న జరిగే ఎమ్మార్వో కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యులు వేముల సైదులు మాట్లాడుతూ గ్రామంలో మహిళా సంఘాలకు, అంగన్వాడీ, గ్రంథాలయాలకు స్థలం కేటాయించాలని, బిల్డింగ్ల నిర్మాణం చేపట్టాలని, రంగమ్మ గూడెం, పిల్లి గూడెం, ఉత్తటూరు, మాండ్ర గ్రామాలకు బీటీ రోడ్లు వేయాలని, అర్హులైన వారికి ఇళ్ల […]
దిశ, రామన్నపేట: రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ సమస్యల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 25న జరిగే ఎమ్మార్వో కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యులు వేముల సైదులు మాట్లాడుతూ గ్రామంలో మహిళా సంఘాలకు, అంగన్వాడీ, గ్రంథాలయాలకు స్థలం కేటాయించాలని, బిల్డింగ్ల నిర్మాణం చేపట్టాలని, రంగమ్మ గూడెం, పిల్లి గూడెం, ఉత్తటూరు, మాండ్ర గ్రామాలకు బీటీ రోడ్లు వేయాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, దరఖాస్తు చేసుకున్నవారికి వితంతు పెన్షన్లు ఇవ్వాలని, మహిళలకు చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలని ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ కార్యదర్శి కన్నెబోయిన యాదయ్య, గ్రామ ప్రజలు, వేముల చంద్రయ్య, వెంకన్న , స్వామి, మచ్చ నరసింహ, పాపయ్య, నడిగోటి నరసింహ, పార్వతమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.