పాత తేదీలతో ఎక్సైజ్ శాఖలో భారీగా ప్రమోషన్స్

దిశ, తెలంగాణ బ్యూరో : ఆబ్కారీ శాఖలో పదోన్నతులను మళ్లీ మొదలుపెట్టారు. ఒకేసారి 50 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే దాదాపు నెల రోజుల కిందట 12 మందికి అసిస్టెంట్​ఎక్సైజ్​సూపరింటెండెంట్​నుంచి ఎక్సైజ్​సూపరింటెండెంట్‌లుగా పదోన్నతులు ఇచ్చి పోస్టింగ్‌లు కల్పించారు. ప్రస్తుతం 50 మందికి కూడా పదోన్నతులు ఇచ్చి పాత స్థానాల్లో యథావిధిగా పని చేయాలని ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదోన్నతులతో అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు. అయితే తాజాగా బుధవారం జారీ […]

Update: 2021-07-14 15:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆబ్కారీ శాఖలో పదోన్నతులను మళ్లీ మొదలుపెట్టారు. ఒకేసారి 50 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే దాదాపు నెల రోజుల కిందట 12 మందికి అసిస్టెంట్​ఎక్సైజ్​సూపరింటెండెంట్​నుంచి ఎక్సైజ్​సూపరింటెండెంట్‌లుగా పదోన్నతులు ఇచ్చి పోస్టింగ్‌లు కల్పించారు. ప్రస్తుతం 50 మందికి కూడా పదోన్నతులు ఇచ్చి పాత స్థానాల్లో యథావిధిగా పని చేయాలని ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదోన్నతులతో అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు.

అయితే తాజాగా బుధవారం జారీ చేసిన ప్రమోషన్ల ఉత్తర్వుల్లో మాత్రం రెండు నెలల కిందటే ఇచ్చినట్లు చూపించారు. దీంతో పాత తేదీల్లో ఉత్తర్వులు రావడం కొంత గందరగోళంగా మారింది. అయితే గతంలోనే కొంతమందికి ప్రమోషన్లు ఇవ్వడంతోనే న్యాయపరమైన చిక్కులు వస్తాయనే కారణంగా రెండు నెలల కిందటే ఇచ్చారంటున్నారు. అందుకే వారికి మళ్లీ కొత్త పోస్టింగ్​లు ఇవ్వలేదని, పోస్టింగ్‌లు ఇస్తే జాయినింగ్​తేదీల్లో ఇబ్బందులు వస్తాయని యధాస్థానాల్లో కంటిన్యూ చేశారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

రాష్ట్ర అబ్కారీ శాఖలో కొద్ది రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ఫైల్‌కు మోక్షం లభించింది. పదోన్నతుల ఉత్తర్వులను సీఎస్​ సోమేశ్​కుమార్​ బుధవారం జారీ చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్​ ఎక్సైజ్​సూపరింటెండెంట్​లుగా పని చేస్తున్న 24 మందికి ఎక్సైజ్​ సూపరిటెండెంట్‌లుగా ప్రమోషన్​కల్పించారు. వీరితో పాటుగా 18 మంది ఎక్సైజ్​ సూపరింటెండెంట్​లకు అసిస్టెంట్​ కమిషనర్లుగా ప్రమోషన్​ ఇచ్చారు. ఇక అసిస్టెంట్​ ఎక్సైజ్​ కమిషనర్లుగా పని చేస్తున్న ముగ్గురికి డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతి కల్పించారు. అంజన్​రావు, హరికిషన్, ఏ శ్రీనివాస్​రెడ్డికి డీసీగా ప్రమోషన్​ వచ్చింది. వీరితో పాటుగా ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్లుగా పని చేస్తున్న నలుగురు మాధవ్, యాసిన్​ఖురేషీ, సురేష్, కేఏబీ శాస్త్రికి జాయింట్​కమిషనర్లుగా పదోన్నతి ఇచ్చారు. ఇక జాయింట్​ కమిషనర్‌గా ఉన్న ఎన్.ఏ అజయ్​రావుకు అడిషనల్​కమిషనర్‌గా ప్రమోషన్​ ఇచ్చారు.

ప్రభుత్వానికి టీజీవో ధన్యవాదాలు

ఎక్సైజ్​లో పదోన్నతులు కల్పించినందుకు తెలంగాణ గెజిటెడ్​ అధికారుల సంఘం, తెలంగాణ ఎక్సైజ్​ గెజిటెడ్​ అధికారుల సంఘం తరుపున సీఎం కేసీఆర్​, మంత్రి శ్రీనివాస్​గౌడ్​, సీఎస్​ సోమేశ్​కుమార్​కు ధన్యవాదాలు తెలిపారు. టీజీఓ ఆధ్వర్యంలో పదోన్నతుల కోసం ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తితో అవకాశం కల్పించారన్నారు. టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణతో పాటు టీజీఓ అబ్కారీ అసోసియేషన్​ అధ్యక్షుడు రవీందర్​రావు, లక్ష్మణ్​గౌడ్​, టీజీఓ ప్రతినిధులు అరుణ్​ కుమార్, శ్రీనివాస్​రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు అండగా ప్రభుత్వం ఉంటుందని, త్వరలోనే అన్ని శాఖల్లో పదోన్నతులు వస్తాయని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News