హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశంలో లాకౌడౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హర్యానా ముఖ్యంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై చదువులకు వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి బోర్డు పరీక్షలు కొన్ని నిర్వహించగా సైన్స్ పరీక్ష ఒక్కటి వాయిదా పడింది. అంతకు ముందు రాసిన సబెక్ట్‌ల్లో వచ్చే […]

Update: 2020-04-05 23:49 GMT

దేశంలో లాకౌడౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హర్యానా ముఖ్యంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై చదువులకు వెళ్లేలా ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి బోర్డు పరీక్షలు కొన్ని నిర్వహించగా సైన్స్ పరీక్ష ఒక్కటి వాయిదా పడింది. అంతకు ముందు రాసిన సబెక్ట్‌ల్లో వచ్చే మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతను నిర్ణయించనున్నారు. అలాగే రాష్ట్రంలో వచ్చే వారంలో బైసాకి, మరికొన్ని పండుగలు ఉన్నాయని, కరోనా వైరస్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని కోరారు.

Tags: Haryana,cm,Mnohar lal khattar,Oreders

Tags:    

Similar News