Himachal : హిమాచల్ లో పొగమంచు ఎఫెక్ట్.. 223 రోడ్లు మూసివేత
ఉత్తరభారతంలో చలితీవ్రత పెరిగిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో.. పొగమంచు కప్పేసింది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన సిమ్లా, కులు, మనాలి ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ జాం అయ్యింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరభారతంలో చలితీవ్రత పెరిగిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు(Himachal Pradesh snow) పడిపోవడంతో.. పొగమంచు కప్పేసింది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన సిమ్లా(Shimla), కులు, మనాలి(Manali) ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఆ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దాదాపు 1,500 వాహనాలు మంచులో చిక్కుకున్నాయి. ఈ వాహనాలను తొలగించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మరోవైపు, హిమాచల్ లో పొగమంచు వల్ల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్(Himachal Pradesh roads closed) అయ్యాయి. మూడు జాతీయ రహదారులతో సహా 223 రహదారులను అధికారులుమూసివేశారు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మంచు కురవడం వల్ల రోడ్లు సుదీర్ఘ ట్రాఫిక్ జాంల వల్ల చాలా మంది పర్యాటకులు రాత్రిపూట వాహనాల్లో చిక్కుకుపోయారు. చాలా మంది పర్యాటకులు రాత్రిపూట వారి వాహనాల్లో చిక్కుకుపోయారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతుందని మనాలి డీఎస్పీ కేడీ శర్మ అన్నారు. పోలీసు సిబ్బంది జీరో ఉష్ణోగ్రత దగ్గర పనిచేసినట్లు తెలిపారు. దాదాపు 8 వేల మంది పర్యాటకులను(tourists rescued) సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. భారీ హిమపాతం కారణంగా, మనాలి-లేహ్ హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు.