షాక్‌లో ఇండస్ట్రీ.. ప్రముఖ నటుడు మృతి
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి.బాలచంద్రన్(62) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. కేరళలోని కొల్లం జిల్లాలోని శాస్తంకోట గ్రామంలో బాలచంద్రన్ ఫిబ్రవరి 2, 1952న జన్మించారు. రైటర్‌గా, నటుడిగా పలు సినిమాలకు పనిచేశారు. నటుడుగా వెండితెరపై అడుగు పెట్టకముందు ముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో టీచర్‌గా పనిచేసారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. బాలచంద్రన్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి.బాలచంద్రన్(62) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. కేరళలోని కొల్లం జిల్లాలోని శాస్తంకోట గ్రామంలో బాలచంద్రన్ ఫిబ్రవరి 2, 1952న జన్మించారు. రైటర్‌గా, నటుడిగా పలు సినిమాలకు పనిచేశారు. నటుడుగా వెండితెరపై అడుగు పెట్టకముందు ముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో టీచర్‌గా పనిచేసారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. బాలచంద్రన్ చివరగా మమ్ముట్టి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ వన్‌లో కనిపించారు. బాలచంద్రన్ మృతికి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.