ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న జిమ్నాస్ట్.. ప్రశంసించిన ప్రియాంక

దిశ, సినిమా : జిమ్నాస్టిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువ తార సిమోన్‌ బైల్స్‌.. టోక్యో ఒలింపిక్స్ 2020 నుంచి తప్పుకుంది. మానసికంగా సిద్ధంగా లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె నిర్ణయం క్రీడాప్రపంచానికి షాక్ ఇవ్వగా.. మానసిక ఆరోగ్య అంశం గ్లోబల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సిమోన్ నిర్ణయాన్ని స్వాగతించగా.. ప్రియాంక చోప్రా కూడా తనకు మద్దతుగా పలు విషయాలు […]

Update: 2021-07-29 03:21 GMT

దిశ, సినిమా : జిమ్నాస్టిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువ తార సిమోన్‌ బైల్స్‌.. టోక్యో ఒలింపిక్స్ 2020 నుంచి తప్పుకుంది. మానసికంగా సిద్ధంగా లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె నిర్ణయం క్రీడాప్రపంచానికి షాక్ ఇవ్వగా.. మానసిక ఆరోగ్య అంశం గ్లోబల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సిమోన్ నిర్ణయాన్ని స్వాగతించగా.. ప్రియాంక చోప్రా కూడా తనకు మద్దతుగా పలు విషయాలు పంచుకుంది.

గతంలో తన యూట్యూబ్ సిరీస్ కోసం సిమోన్‌తో చేసిన ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసిన పీసీ.. ‘రోల్ మోడల్, చాంపియన్@ సిమోన్‌ బైల్స్ గురించి కొన్నేళ్ల కిందట తెలుసుకోవడం ఆనందాన్నిచ్చింది. ఆమె తన బలహీనతపై స్వీయ అవగాహనతో నన్ను ఇంప్రెస్ చేసింది’ అని తెలిపింది. ఈ మేరకు సిమోల్‌ను GOAT-(గేట్‌నెస్ ఆఫ్ ఆల్ టైమ్)గా వర్ణించిన ప్రియాంక.. మనుషులకు ఇది సాధారణ విషయమేనని క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పింది. నార్మల్‌గా ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలమని, ధైర్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని రియల్ చాంపియన్‌‌గా నిరూపించుకున్నావు అని ప్రశంసించింది.

Tags:    

Similar News