జాతి యుద్ధాన్ని అంతం చేద్దాం: ప్రియాంక

బాలీవుడ్‌లో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రియాంక.. తన నటనతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. తప్పు జరిగితే ఇది తప్పు అని ముక్కుసూటిగా చెప్పే తత్వం తనది. ఒకరికోసం ఒకరు తోడుండాల్సింది కష్టసుఖాల్లో కానీ, తప్పుడు పనుల్లో కాదని చెబుతోంది. ‘ప్రపంచస్థాయిలో మనం చేయాల్సింది చాలా ఉంది.. అది వ్యక్తిగత స్థాయి నుంచే ప్రారంభం కావాలి. మనల్ని మనం విద్యావంతులుగా తీర్చిదిద్దుకుంటూ.. ప్రపంచంలో ఉన్న జాతి యుద్ధాన్ని, ద్వేషాన్ని అంతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని […]

Update: 2020-05-30 04:10 GMT

బాలీవుడ్‌లో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రియాంక.. తన నటనతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. తప్పు జరిగితే ఇది తప్పు అని ముక్కుసూటిగా చెప్పే తత్వం తనది. ఒకరికోసం ఒకరు తోడుండాల్సింది కష్టసుఖాల్లో కానీ, తప్పుడు పనుల్లో కాదని చెబుతోంది. ‘ప్రపంచస్థాయిలో మనం చేయాల్సింది చాలా ఉంది.. అది వ్యక్తిగత స్థాయి నుంచే ప్రారంభం కావాలి. మనల్ని మనం విద్యావంతులుగా తీర్చిదిద్దుకుంటూ.. ప్రపంచంలో ఉన్న జాతి యుద్ధాన్ని, ద్వేషాన్ని అంతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిస్తోంది. ముఖ్యంగా చర్మరంగు వల్ల ఇతరుల చేతిలో హతం కావడం చాలా దారుణం’ అంటూ మే 25న జరిగిన ఓ సంఘటన గురించి సోషల్ మీడియా వేదికగా మద్దతు కోరింది.

అమెరికాలోని మిన్నెసోటా పట్టణంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని మినియపాలిస్ పోలీస్ అధికారి చంపడం చాలా నీచమైన చర్యగా పరిగణించింది. బాధితుడు ప్రాణాలతో పోరాడుతూ ఊపిరి పీల్చుకునేందుకు కూడా కష్టపడుతుంటే మిగతా అధికారులు చూస్తూ నిలబడ్డారు తప్ప కనీసం దగ్గరికెళ్లే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ అధికారిపై కేసు నమోదు కాగా.. మీరు దీనికి మద్దతు తెలపాలని కోరుతోంది. 55156 కు “FLOYD” అని టెక్స్ట్ చేసి పిటిషన్‌పై సంతకం చేయండని సూచిస్తోంది.

‘జార్జ్ నీ ఆత్మకు శాంతి కలగాలి, మీ కుటుంబానికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని తెలిపిన ప్రియాంక.. నేను శ్వాస తీసుకోలేకపోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Tags:    

Similar News