గ్యాంగ్ రేప్ బెదిరింపులు.. వణికిపోయిన ప్రియాంక చోప్రా

దిశ, సినిమా : ఇంటర్నేషనల్ మ్యూజిక్ ప్రపంచంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. తాజాగా విడుదల చేసిన ‘అన్ ఫినిష్డ్’ పుస్తకంలో ఇందుకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. బాలీవుడ్‌లో రెండు దశాబ్ధాల పాటు స్టార్ రేంజ్‌తో దూసుకుపోయిన పీసీ.. 2012లో యూఎస్‌లో తన ఫస్ట్ సింగిల్(మై సిటీ) రిలీజైన టైమ్‌లో ఎంత ఎగ్జైటింగ్‌గా ఉన్నానో తెలిపింది. కానీ అదంతా ద్వేషపూరితమైన ట్వీట్స్, మెయిల్స్‌తో క్రష్ అయిపోయిందని తెలిపింది. […]

Update: 2021-02-25 03:09 GMT

దిశ, సినిమా : ఇంటర్నేషనల్ మ్యూజిక్ ప్రపంచంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. తాజాగా విడుదల చేసిన ‘అన్ ఫినిష్డ్’ పుస్తకంలో ఇందుకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. బాలీవుడ్‌లో రెండు దశాబ్ధాల పాటు స్టార్ రేంజ్‌తో దూసుకుపోయిన పీసీ.. 2012లో యూఎస్‌లో తన ఫస్ట్ సింగిల్(మై సిటీ) రిలీజైన టైమ్‌లో ఎంత ఎగ్జైటింగ్‌గా ఉన్నానో తెలిపింది. కానీ అదంతా ద్వేషపూరితమైన ట్వీట్స్, మెయిల్స్‌తో క్రష్ అయిపోయిందని తెలిపింది. భారత్‌లో ఈ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయినప్పటికీ.. యూఎస్‌లో హిట్ చేసేందుకు మేకర్స్ చాలా కష్టపడ్డారని తెలిపింది.

ఆ సమయంలో యూఎస్‌లో జాత్యహంకార బాధితురాలిగా ఉన్నానని తెలిపిన ప్రియాంక.. గ్యాంగ్ రేప్ బెదిరింపులు కూడా వచ్చాయని పుస్తకంలో పేర్కొంది. ‘ఓ బ్రౌన్ టెర్రరిస్ట్ అమెరికాలో ప్రమోషన్స్ చేయడమేంటి? నీ దేశానికి వెళ్లి బుర్కా వేసుకో.. సామూహిక అత్యాచారం చేయించుకో’ అనే సారాంశంతో ఉన్న మెయిల్స్.. తనకు బాధ కలిగించాయని చెప్పింది. ఇవన్నీ ఇప్పుడు తన పుస్తకంలో రాయడం కొంచెం ఇబ్బందిగా ఉందని తెలిపిన ప్రియాంక.. బాలీవుడ్ కెరియర్, పర్సనల్ మ్యాటర్స్ గురించి కూడా పుస్తకంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News