వయసు పెరుగుతుందని ఫీలవుతున్న ప్రియాంక

దిశ, సినిమా: సెల్ఫ్ బాడీ ఇమేజ్‌ తనపై ప్రభావం చూపిందని గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తెలిపింది. పదేళ్ల క్రితం ఉన్న బాడీ ఇప్పుడు ఉండదని, వయసుతో పాటు మారుతున్న శరీరాన్ని అంగీకరించక తప్పదని వివరించింది. అయితే ఈ విషయంలో కొద్దిగా బాధపడినా.. మానసికంగా అలవాటు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అందరిలాగే వయసు పెరిగేకొద్దీ తన శరీరం కూడా మారిందన్న 38 ఏళ్ల ప్రియాంక.. మనం ఎలా కనిపిస్తున్నామనే దానికంటే మనం చేసే పనిలో ఎంత మంచి […]

Update: 2021-05-12 23:53 GMT

దిశ, సినిమా: సెల్ఫ్ బాడీ ఇమేజ్‌ తనపై ప్రభావం చూపిందని గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తెలిపింది. పదేళ్ల క్రితం ఉన్న బాడీ ఇప్పుడు ఉండదని, వయసుతో పాటు మారుతున్న శరీరాన్ని అంగీకరించక తప్పదని వివరించింది. అయితే ఈ విషయంలో కొద్దిగా బాధపడినా.. మానసికంగా అలవాటు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అందరిలాగే వయసు పెరిగేకొద్దీ తన శరీరం కూడా మారిందన్న 38 ఏళ్ల ప్రియాంక.. మనం ఎలా కనిపిస్తున్నామనే దానికంటే మనం చేసే పనిలో ఎంత మంచి ఔట్‌పుట్ ఇస్తున్నామనేది కీలకమని భావిస్తున్నట్లు తెలిపింది. ఒక పని చేసేటప్పుడు తన నుంచి ఎలాంటి కంట్రీబ్యూషన్ ఇవ్వాలి? చేసే వర్క్‌లో బెస్ట్ ఇవ్వగలుగుతున్నానా? అని ఆలోచిస్తానని చెప్పింది. తన బాడీ బెస్ట్‌గా లేదనుకునే రోజుల్లోనూ తనను హ్యాపీగా ఉంచే వర్క్ చేస్తానన్న ప్రియాంక.. మనలో ఉన్న ఆత్మవిశ్వాసం, సామర్థ్యం మాత్రమే ఇతరులను ఆకట్టుకునేలా చేస్తుంది తప్పా శరీరంతో సంబంధం ఉండదని అభిప్రాయపడింది.

Tags:    

Similar News