ఇక ప్రైవేట్ రంగమే రాకెట్లను తయారు చేయవచ్చు : ఇస్రో చీఫ్ శివన్

న్యూఢిల్లీ: స్పేస్ సెక్టార్‌లోకి ప్రైవేట్ రంగానికి అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ఇస్రో చీఫ్ కె శివన్ ప్రశంసలు కురిపించారు. ఈ నిర్ణయంతో ప్రైవేటు రంగంలోని సంస్థలూ రాకెట్లను తయారు చేయవచ్చునని, లాంచ్ సేవలను అందించవచ్చునని, గ్రహాంతర మిషన్‌లలోనూ ఇస్రోకు సహకరించవచ్చునని తెలిపారు. కేంద్ర నిర్ణయం ద్వారా అంతరిక్ష సాంకేతికత ప్రయోజనాలను ప్రజలకు మరింత చేరువచేయవచ్చునని పేర్కొన్నారు. గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ పాత్రను విశేషంగా పెంచడమే కాదు, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని […]

Update: 2020-06-25 09:42 GMT

న్యూఢిల్లీ: స్పేస్ సెక్టార్‌లోకి ప్రైవేట్ రంగానికి అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ఇస్రో చీఫ్ కె శివన్ ప్రశంసలు కురిపించారు. ఈ నిర్ణయంతో ప్రైవేటు రంగంలోని సంస్థలూ రాకెట్లను తయారు చేయవచ్చునని, లాంచ్ సేవలను అందించవచ్చునని, గ్రహాంతర మిషన్‌లలోనూ ఇస్రోకు సహకరించవచ్చునని తెలిపారు. కేంద్ర నిర్ణయం ద్వారా అంతరిక్ష సాంకేతికత ప్రయోజనాలను ప్రజలకు మరింత చేరువచేయవచ్చునని పేర్కొన్నారు. గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ పాత్రను విశేషంగా పెంచడమే కాదు, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని వివరించారు. రోటీన్‌గా చేసే పనులను ప్రైవేట్ రంగానికి కేటాయించి గ్రహాన్వేషణ, అంతరిక్ష ప్రయోగాలు, ఇతర ప్రయోగాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇస్రో దృష్టి పెట్టవచ్చునని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News