‘బతిమిలాడి అఖిలప్రియకు అన్నం పెట్టాం’

దిశ, వెబ్‌డెస్క్: కిడ్నాప్ కేసులో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి అఖిలప్రియ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి ఆమె ఏమీ తినకపోవడం మూలంగా గురువారం ఉదయం ఫిట్స్ వచ్చిందని వెల్లడించారు. అంతేగాకుండా ఉదయం మందులు వేసుకోలేదని, ఏమీ తినకపోవడంతో నీరసంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు జైలు సిబ్బంది నచ్చజెప్పి, బతిమిలాడి […]

Update: 2021-01-07 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కిడ్నాప్ కేసులో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి అఖిలప్రియ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి ఆమె ఏమీ తినకపోవడం మూలంగా గురువారం ఉదయం ఫిట్స్ వచ్చిందని వెల్లడించారు. అంతేగాకుండా ఉదయం మందులు వేసుకోలేదని, ఏమీ తినకపోవడంతో నీరసంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు జైలు సిబ్బంది నచ్చజెప్పి, బతిమిలాడి సాంబార్ రైస్ తినిపించారని జైలు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News