CDS గా బిపిన్ రావత్ స్థానాన్ని భర్తీ చేసేది అతనే?
దిశ, వెబ్‌డెస్క్: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తన కుటుంబంతో కలిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ చెట్టుకు ఢీకొనడం, ఆతర్వాత మంటలు చేలరేగడంతో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. అయితే, ప్రస్తుతం భారత త్రివిధ దళాధిపతి హోదాలో ఉన్న బిపిన్ రావత్ కన్నుమూయడంతో తరుపరి CDS ఎవరనే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అంతేగాకుండా.. దేశం మొత్తం తీవ్ర శోకసంద్రంలో […]
దిశ, వెబ్‌డెస్క్: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తన కుటుంబంతో కలిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ చెట్టుకు ఢీకొనడం, ఆతర్వాత మంటలు చేలరేగడంతో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. అయితే, ప్రస్తుతం భారత త్రివిధ దళాధిపతి హోదాలో ఉన్న బిపిన్ రావత్ కన్నుమూయడంతో తరుపరి CDS ఎవరనే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అంతేగాకుండా.. దేశం మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిన ఈ విషాద సమయంలోనూ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడకూడన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించి తదుపరి CDS నియామకంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతోన్న మనోజ్ ముకుంద్ నరవణేను CDSగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాకుండా.. వైస్ CDSగా ఉన్న ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ పేరు కూడా కేంద్ర రక్షణ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.