వ్యాక్సిన్ తీసుకోనున్న నరేంద్రమోడీ..?

దిశ, వెబ్‌డెస్క్ : రెండో దశ టీకా పంపిణీలో 60 ఏళ్లు పైబడినవారికీ వ్యాక్సిన్ వేయనున్న సందర్భంగా 70 ఏళ్లు నిండిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా టీకా వేసుకుంటారన్న చర్చ జరిగింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్‌నూ విలేకరులు ప్రశ్నించారు. ఆయన అతి సాధారణ జవాబునిచ్చారు. లబ్దిదారులు వారికి కావల్సిన చోట వారే స్వయంగా వేసుకుంటారని దాటవేశారు. కాగా, అదే సమావేశంలోనున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరో వివరణ ఇచ్చారు. మంత్రులందరూ చాలా […]

Update: 2021-02-24 08:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రెండో దశ టీకా పంపిణీలో 60 ఏళ్లు పైబడినవారికీ వ్యాక్సిన్ వేయనున్న సందర్భంగా 70 ఏళ్లు నిండిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా టీకా వేసుకుంటారన్న చర్చ జరిగింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్‌నూ విలేకరులు ప్రశ్నించారు. ఆయన అతి సాధారణ జవాబునిచ్చారు. లబ్దిదారులు వారికి కావల్సిన చోట వారే స్వయంగా వేసుకుంటారని దాటవేశారు.

కాగా, అదే సమావేశంలోనున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరో వివరణ ఇచ్చారు. మంత్రులందరూ చాలా వరకు డబ్బులు చెల్లించే టీకా వేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. పలుదేశాల్లో టీకా పంపిణీ మొదలైనప్పుడు నేతలు వ్యాక్సిన్ వేసుకుని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించారు. కానీ, ఇండియాలో తొలి టీకా కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమక్షంలో వేసినప్పటికీ ఆయన వేసుకోలేదు. ప్రధానమంత్రీ ఇప్పటి వరకు టీకా వేసుకోకపోవడం గమనార్హం. రెండో దశలో ప్రధాన మంత్రి టీకా వేసుకుంటారని, అదే దశలో 50ఏళ్లు నిండిన అన్ని రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు టీకా వేసుకుంటారన్న వార్తలు గతనెలలో వచ్చాయి.

Tags:    

Similar News