కరోనా.. వందేళ్లలో అతిపెద్ద మహమ్మరి

న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పది రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ‘మన్‌ కీ బాత్’ కార్యక్రమం 77వ ఎడిషన్‌లో తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో దేశంలో రోజుకు 900 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ఉంటే ప్రస్తుతం దేశ అవసరాల రీత్య ఇది 9,500 మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో దేశ ప్రజలు భీకర సంకల్పాన్ని ప్రదర్శించారని, ఈ మహమ్మారి శతాబ్దంలోనే […]

Update: 2021-05-30 09:06 GMT

న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పది రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ‘మన్‌ కీ బాత్’ కార్యక్రమం 77వ ఎడిషన్‌లో తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో దేశంలో రోజుకు 900 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ఉంటే ప్రస్తుతం దేశ అవసరాల రీత్య ఇది 9,500 మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో దేశ ప్రజలు భీకర సంకల్పాన్ని ప్రదర్శించారని, ఈ మహమ్మారి శతాబ్దంలోనే అతిపెద్దదని అన్నారు. సవాల్ ఎంత పెద్దదైనా, అంతకు తగ్గ స్థాయిలో ప్రజల విజయ సంకల్పాన్ని చూపెడుతుంటారని చెప్పారు. ప్రజలందరి ఐక్యపోరాటమే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడిందని తెలిపారు. వైరస్ విస్తృతంగా వ్యాపించినా ఫ్రంట్‌లైన్ వర్కర్లు వెరవలేదని, మారుమూలల్లోకి వెళ్లీ శాంపిళ్లు సేకరించారని అన్నారు. అత్యున్నత సేవలకు వారు నిదర్శనమని కొనియాడారు. ఈ సంకట సమయంలో రైతులకూ కృతజ్ఞతలు సమర్పించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రజలందరికీ ఆహారాన్ని పండించి సేవ చేశారని వివరించారు.

మహమ్మారి ఒకవైపు.. విపత్తులు మరోవైపు

ఒకవైపు కరోనా మహమ్మారితోపాటు కొన్ని రాష్ట్రాలు ప్రకృతి విపత్తులనూ ఎదుర్కోవాల్సి వచ్చిందని తౌక్టే, యాస్ తుపానులను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమాన తౌక్టే, తూర్పున యాస్ తుపాను కొన్ని రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిందని, కానీ, ప్రస్తుత సంకట పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలు, ప్రజలు సమన్వయంతో చురుగ్గా వ్యవహరిస్తూ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని తెలిపారు. తుపాన సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని ఎంత అభినందించినా తక్కువేనని అన్నారు. వారందరికీ తాను సెల్యూట్ చేస్తానని చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారందరికీ సానుభూతిని తెలిపారు.

కరెక్ట్ ట్రాక్‌లోనే వెళ్తున్నాం

కేంద్రంలో తన ప్రభుత్వం కొలువుదీరి ఏడేళ్లు గడుస్తున్న విషయాన్ని పేర్కొంటూ దేశం సరైన దారిలోనే వెళ్తున్నదని భావిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. విదేశాల వ్యూహాలు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా సొంత ఆలోచనలు, సంకల్పాలతో దేశం పనిచేస్తుండటాన్ని చూస్తే తాము గర్విస్తు్న్నామని తెలిపారు. దేశ భద్రత విషయంలో రాజీ పడలేదని, రక్షక దళాలను పరిపుష్టి చేయడంలోనూ కాంప్రమైజ్ కాలేదని వివరించారు. ఈ విషయాల కారణంగానే తాము కరెక్ట్ ట్రాక్‌లో వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నామని పేర్కొ్న్నారు. ఈ ఏడేళ్లు సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే సూత్రం ఆధారంగా పాలన సాగించామని తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమంలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్, ఆక్సిజన్ సరఫరాలో పనిచేసిన రైల్వే మహిళా డ్రైవర్, ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌తో మాట్లాడారు.

Tags:    

Similar News