రాజ్యసభలో ప్రధాని మోదీ కంటతడి.. ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో పదవీ విరమణ పొందుతున్న సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు వీడ్కోలు తెలుపుతూ భావోద్వేగంగా ప్రసంగించారు ప్రధాని మోదీ. గులాం నబీ ఆజాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గులాం నబీ ఆజాద్ సేవలు సేవలు చిరస్మరణీయం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిమంతుడని పేర్కొన్నారు. ఉద్యోగాలు, పదవులు, అధికారాలు వస్తాయి.. పోతాయి.. […]
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో పదవీ విరమణ పొందుతున్న సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు వీడ్కోలు తెలుపుతూ భావోద్వేగంగా ప్రసంగించారు ప్రధాని మోదీ. గులాం నబీ ఆజాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
గులాం నబీ ఆజాద్ సేవలు సేవలు చిరస్మరణీయం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిమంతుడని పేర్కొన్నారు. ఉద్యోగాలు, పదవులు, అధికారాలు వస్తాయి.. పోతాయి.. కానీ వాటిని ఎలా నిర్వహించాలో ఆజాద్‌ను చూసి నేర్చుకోవాలి అన్నారు. సభలో ప్రతిపక్ష నేతగా ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరు లేరన్నారు. కేవలం పార్టీ కోసమే కాకుండా సభ, దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్ అని ప్రశంసలు కురిపించారు. ఆజాద్‌ను ఎప్పటికీ రిటైర్ అవనివ్వబోనని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సమయంలో తనకు ముందు ఫోన్ చేసింది ఆజాదే అని మోదీ గుర్తు చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల మృతదేహాలను రాష్ట్రానికి తరలించేదుకు ఆజాద్‌తో పాటు ప్రణబ్ ముఖర్జీ ఎంతో శ్రమించారని తెలిపారు. ఆజాద్ ప్రతి ఒక్కరినీ తన కుటుంబసభ్యుల్లాగే చూసుకుంటారని ప్రధాని మోదీ మాట్లాడారు.