ఆంధ్రా స్పెషల్ : పెసర బొబ్బట్లు..!

ఆంధ్రాలో ఏ పండుగకు అయిన తయారు చేసే పిండి వంటల్లో బొబ్బట్లు స్పెషల్. ఇక వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకంగా అమ్మవారికి బొబ్బట్లు నైవేధ్యంగా పెడతారు. వీటిని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇపుడు పెసర బొబ్బట్లు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు : మైదా పిండి- ఒకటిన్నర కప్పు, పెసరపప్పు – 1 కప్పు, చక్కెర – 1 కప్పు, నూనె -2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, […]

Update: 2020-10-25 01:39 GMT

ఆంధ్రాలో ఏ పండుగకు అయిన తయారు చేసే పిండి వంటల్లో బొబ్బట్లు స్పెషల్. ఇక వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకంగా అమ్మవారికి బొబ్బట్లు నైవేధ్యంగా పెడతారు. వీటిని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇపుడు పెసర బొబ్బట్లు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు :

మైదా పిండి- ఒకటిన్నర కప్పు, పెసరపప్పు – 1 కప్పు, చక్కెర – 1 కప్పు, నూనె -2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – 1/2 టీస్పూను, నీళ్లు -సరిపడినంత, ఉప్పు – తగినంత.

తయారీ విధానం :

ముందుగా మైదా పిండిలో ఒక టేబుల్‌ స్పూను నూనె, అర టీస్పూను ఉప్పు, తగినంత వాటర్ పోసి పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి. పెసరపప్పును ఉడికించి నీటిని తీసేసి పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాత్రలో చక్కెర వేసి పెసరపప్పు మ్యాష్‌ను వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్‌ మీద సన్నని మంటపై చక్కెర కరిగి పెసరపప్పులో ఇంకి చిక్కగా అయ్యేంతవరకు చూసుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు, యాలకుల పొడి వేసుకుని చల్లారనివ్వాలి.

ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ పరిమాణం సైజులో ఉండలుగా చేసుకోవాలి. ముద్దలా తయారుచేసిన మైదాపిండిని తీసుకుని అరచేతి మందాన ఒత్తాలి. అందులో పెసర మిశ్రమాన్ని పెట్టి నాలుగువైపుల నుంచి మైదాపిండిని పైకి తెచ్చి బాల్‌లా చేసుకోవాలి. ఈ ఉండల్ని అరటి ఆకు లేదా ప్లాస్టిక్‌ పేపర్‌ మీద నూనె రాసి గుండ్రంగా ఒత్తాలి. తర్వాత స్టవ్ మీద వేడి చేసిన పెనంపై నూనె వేసి ఇరువైపులా బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చాలి. ఇలా చేసిన తర్వాత వాటి మీద నెయ్యి వేస్తే పెసర బొబ్బట్లు రెడీ..

Tags:    

Similar News