గర్భం దాల్చిన మైనర్.. పెళ్లికి ప్రియుడు నో చెప్పడంతో..!

దిశ, మహబూబాబాద్ : ప్రేమ పేరుతో బాలికను మచ్చిక చేసుకుని పెళ్లి పేరుతో ఆమెను లోబరుచుకుని తల్లిని చేశాడో ప్రబుద్ధుడు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో పాటు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు నాయక్ తండాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మహబూబాబాద్ పట్టణ శివారు బాబునాయక్ తండాకు చెందిన ఓ యువకుడు అదే తండాలో ఉంటున్న బాలికను పెళ్లి […]

Update: 2021-05-30 11:22 GMT

దిశ, మహబూబాబాద్ : ప్రేమ పేరుతో బాలికను మచ్చిక చేసుకుని పెళ్లి పేరుతో ఆమెను లోబరుచుకుని తల్లిని చేశాడో ప్రబుద్ధుడు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో పాటు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు నాయక్ తండాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మహబూబాబాద్ పట్టణ శివారు బాబునాయక్ తండాకు చెందిన ఓ యువకుడు అదే తండాలో ఉంటున్న బాలికను పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు.

పెళ్లి చేసుకోవాలని మైనర్ అడిగే సరికి ఆమెను దూరం పెట్టడంతో పాటు వేరే వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక మనస్తాపం చెంది బావిలో దూకింది. అది గమనించిన తండా వాసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని బాలికను కాపాడి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ టౌన్ పోలీసులు బాధిత కుటుంబంతో పాటు బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News