నిండు గర్భిణీని బలిగొన్న కరోనా..

దిశ, మహబూబూబాద్ : కరోనా సోకడంతో ఎనిమిది నెలల నిండు గర్భిణీ మృతి చెందింది. ఈ విషాదకరమైన ఘటన మహబూబూబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్ పల్లి గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే..నాయక్ పల్లి గ్రామానికి చెందిన 8 నెలల గర్భణీకి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, చికిత్స నిమిత్తం మహబూబూబాద్ జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకుంటోంది. ఈక్రమంలోనే శనివారం పరిస్థితి విషమించడంతో గర్భిణీ మహిళ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. […]

Update: 2021-05-22 12:01 GMT

దిశ, మహబూబూబాద్ : కరోనా సోకడంతో ఎనిమిది నెలల నిండు గర్భిణీ మృతి చెందింది. ఈ విషాదకరమైన ఘటన మహబూబూబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్ పల్లి గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే..నాయక్ పల్లి గ్రామానికి చెందిన 8 నెలల గర్భణీకి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, చికిత్స నిమిత్తం మహబూబూబాద్ జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకుంటోంది. ఈక్రమంలోనే శనివారం పరిస్థితి విషమించడంతో గర్భిణీ మహిళ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలియడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags:    

Similar News