ఆ ఊరి అబ్బాయిలతో పిల్లల్ని కనేందుకు భారత్ కు విదేశీ యువతులు క్యూ

దిశ,వెబ్‌డెస్క్:జమ్మూ- కాశ్మీర్ ఈ మాట వినగానే ప్రకృతి ప్రేమికుల గుండె పులకించిపోతుంది. కొండలు, కోనలు, లోయలు, జాలువారే జలపాతాలు. మనస్సుని కట్టిపడేసే అందాలు. ఇలా ఒక్కటేమిటి సమస్త కాశ్మీరం ముగ్దమనోహరం. మాటల్లో వర్ణించలేని అందం కాశ్మీర్ సొంతం. అందుకే అందాల కాశ్మీరం భూతల స్వర్గం. దేశంలోనే అతి సుందర పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ కు ప్రత్యేక స్థానం ఉంది. హిమగిరుల పాదాల చెంత అందాల ఆరబోతను మనసారా ఆస్వాదించేందుకు నిత్యం దేశ, విదేశాల నుంచి వేలాది మంది […]

Update: 2021-01-18 02:31 GMT

దిశ,వెబ్‌డెస్క్:జమ్మూ- కాశ్మీర్ ఈ మాట వినగానే ప్రకృతి ప్రేమికుల గుండె పులకించిపోతుంది. కొండలు, కోనలు, లోయలు, జాలువారే జలపాతాలు. మనస్సుని కట్టిపడేసే అందాలు. ఇలా ఒక్కటేమిటి సమస్త కాశ్మీరం ముగ్దమనోహరం. మాటల్లో వర్ణించలేని అందం కాశ్మీర్ సొంతం. అందుకే అందాల కాశ్మీరం భూతల స్వర్గం. దేశంలోనే అతి సుందర పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ కు ప్రత్యేక స్థానం ఉంది. హిమగిరుల పాదాల చెంత అందాల ఆరబోతను మనసారా ఆస్వాదించేందుకు నిత్యం దేశ, విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు ఈ మంచుకొండల ప్రాంతానికి వస్తుంటారు. ప్రకృతి మాత సిగలో నుంచి జాలు వారిన హిమాలయ అద్భుతాల్ని ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మరచిపోతుంటారు. అంతటి అందచందాల్ని ఆరబోస్తున్న కాశ్మీర్ లో 2019 అగస్ట్ వరకు భాగమైన లడఖ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టూరిజానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది.

విదేశీ అమ్మాయిలకు ఆ ఊరితో పనేంటీ?

భారత్ లోని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ సంవత్సరానికి 6 నెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రకృతి అందాల్ని ఆస్వాధించేందుకు దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు సముద్ర మట్టానికి 3 నుండి 6 అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్ లో పర్యటిస్తారు. ముఖ్యంగా ఈ లడఖ్ లో ఉన్న దామ్, హనో, దార్చిక్, గార్కోన్ గ్రామాలకు విదేశీ యువతులు క్యూకడుతుంటారు. ఎందుకంటే? గ్రామాల్లోని యువకులతో పడక సుఖం కోరుకోవడమే…! దీంతో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకు చెందిన అమ్మాయిలు ప్రతీఏటా లడఖ్ కు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. యూరప్ అమ్మాయిలు లడఖ్ కు రావడం ఏంటీ..? అందులోనూ గ్రామస్తులతో పడక సుఖం కోరుకోవడం ఏంటీ? ఇదంతా చదువుతుంటే అస్సలు యూరేపియన్ అమ్మాయిలేంటి ఎక్కడో లడఖ్‌లోని యువకులతో పిల్లల్ని కనడం ఏంటనే అనుమానం కలుగక మానదు.

ఆర్యన్లు అంటే

ఆర్యన్లు అంటే ఆజానుభావులు. నీలికళ్లు కలిగిన అబ్బాయిలు. వీళ్లు లడఖ్ లోని మారు మూల గ్రామంలో ఉన్నారని, వీరితో శృంగారం చేసి వాళ్లలాగే ఆర్యన్ సంతానం పొందాలని యూరోపియన్ దేశాలకు చెందిన అమ్మాయిలు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే ప్రతీఏడు పెద్ద సంఖ్యలో అమ్మాయిలు లడఖ్ కు క్యూ కడుతుంటారు. కాబట్టే ఈ ప్రాంతానికి ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరు వచ్చింది.

అలెగ్జాండ్ సైనికులే ఆ ఊరి యువకులా

శత్రువు ఎలాంటి వాడైనా ఎంత వాడైనా యుద్ధంలో ఎలా ఓడించాలో తెలిసిన వీరుడు అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం ఒక్కోరాజ్యాన్ని జయిస్తూ భారత్ వరకు వచ్చారు. పర్షియా తర్వాత, గ్రీకులకు తెలిసిన భూభాగాలన్నిటినీ జయించి చివరిగా క్రీ.పూ 326 వ సంవత్సరంలో భారతదేశంపై దండయాత్ర చేశారు. ఆ దండయాత్రలో జీలం, చీనాబ్ నదీ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించే పౌరవ వంశస్థుడు పురుషోత్తముడితో యుద్ధంలో తలపడ్డాడు. అప్పుడు అతని గుర్రం మరణించింది. అదే సమయంలో అతని సైనిక బలం మొత్తం చిక్కిపోయింది. సైనికులు యుద్ధాలు చేసి బాగా అలిసిపోయారు. ఆ సైన్యంలోని కొంతమంది లడఖ్ లోని ఈ నాలుగు గ్రామాల్లో స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. వారినే చివరి ఆర్యన్లుగా గుర్తిస్తారు.

అందమైన పిల్లల కోసమే విదేశీ యువతుల తాపత్రయం

ఈ నాలుగు గ్రామాల్లో ఉండే సుమారు 5 వేల మంది ఆర్యన్ కు చెందిన యువకులతో శృంగారంలో పాల్గొని వారి ద్వారా అందమైన బిడ్డలకు జన్మనివ్వొచ్చని అమ్మాయిల విశ్వాసం. లడఖ్‌లో చాలా మంది టిబెటో, మంగోల్ లుక్ తో కనిపిస్తారు. కానీ ఈ బ్రోక్పా తెగవారిలో ఇండో- ఆర్యన్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ తెగకు చెందిన మగవారు 6 ఫీట్లకు తగ్గకుండా ఉంటారు. వీరి కళ్లు నీలిరంగులో ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. విశిష్టమైన లక్షణాలున్న ఈ నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు జన్యుపరమైన ప్రత్యేకతల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. గతంలో ఈ ప్రాంతానికి టూరిస్ట్ లను అనుమతించే వారు కాదు. కానీ 2010 నుంచి స్థానిక ప్రభుత్వం ఈ ప్రాంతానికి టూరిస్ట్ లను అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఈ టూరిజం పుంజుకుంది. దీంతో పాటే ప్రెగ్నెన్సీ టూరిజానికి డిమాండ్ పెరిగినట్లు చెబుతారు.

ఆ తరువాత ఇక్కడ ప్రెగ్నెన్సీ టూరిజం తెరపైకి రావడంతో.. ఇక్కడి నివసిస్తుంది ఆర్యన్లేనా, ప్రెగ్నెన్సీ టూరిజం నిజమేనా అన్న అంశంపై శ్రీనగర్ లోని శ్రీనగర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మంజూర్ అహ్మద్ ఖాన్ బ్రోక్పా తెగకు చెందిన ప్రజలపై ప్రత్యేక పరిశోధన చేశారు. ప్రెగ్నెన్సీ టూరిజం గురించి ఇక్కడి తెగకు చెందిన వారి గురించి కొత్త విషయాల్ని తెలుసుకొని ఏడాది పాటు అధ్యయనం చేశారు. 2018 ఫిబ్రవరిలో తన జర్నల్ కు సంబంధించిన నివేదికను సమర్పించారు. దీంతో ఈ తెగకు చెందిన ఆసక్తికర విషయాలు ప్రపంచానికి తెలిశాయి.

Tags:    

Similar News