డీసీ సహాయక కోచ్‌గా ప్రవీణ్ ఆమ్రే

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెట్ ప్రవీణ్ అమ్రేను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. రాబోయే రెండు సీజన్ల పాటు ప్రవీణ్ ఆమ్రే ఢిల్లీ జట్టతో కొనసాగుతాడని ఫ్రాంచైజీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. గత సీజన్‌లో ఢిల్లీ జట్టు ఐపీఎల్ ఫైనల్స్‌ వరకు చేరుకున్నా ముంబయిపై ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఢిల్లీ యాజమాన్యం తమ కోచింగ్, సహాయక సిబ్బందిలో కొన్ని మార్పులు చేసింది. ప్రవీణ్ ఆమ్రే […]

Update: 2021-01-06 11:41 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెట్ ప్రవీణ్ అమ్రేను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. రాబోయే రెండు సీజన్ల పాటు ప్రవీణ్ ఆమ్రే ఢిల్లీ జట్టతో కొనసాగుతాడని ఫ్రాంచైజీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. గత సీజన్‌లో ఢిల్లీ జట్టు ఐపీఎల్ ఫైనల్స్‌ వరకు చేరుకున్నా ముంబయిపై ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఢిల్లీ యాజమాన్యం తమ కోచింగ్, సహాయక సిబ్బందిలో కొన్ని మార్పులు చేసింది.

ప్రవీణ్ ఆమ్రే ఇదే ఫ్రాంచైజీకి 2014-19 వరకు టాలెంట్ సెర్చ్ హెడ్‌గా వ్యవహరించాడు. టీమ్ ఇండియా తరపున కూడా 11 టెస్టులు, 38 వన్డేలు ఆడిన అనుభవం ఉన్నది. మరోవైపు ప్రవీణ్ ముంబయి జట్టుకు రంజీల్లో కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉన్నది. దీంతో ఢిల్లీ యాజమాన్యం అతడిని సహాయక కోచ్‌గా తీసుకున్నది. ఆ జట్టుకు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Tags:    

Similar News