పేదల కడుపు నింపుతున్న హీరోయిన్ ప్రణీత

దిశ వెబ్ డెస్క్: లాక్డౌన్ వేళ.. ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది పేదల కడుపు నింపుతోంది హీరోయిన్ ప్రణీత. కుడ చేత్తో చేసిన దానం .. ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు పెద్దలు. అంటే మనం చేసే దానం పదిమందికి తెలియాల్సిన అవసరం లేదని, చేసిన దానం ఆ క్షణం మరిచిపోవాలని అర్థం. హీరోయిన్ ప్రణీత అదే చేస్తోంది. ప్రచారానికి దూరంగా ఉంటూ, మంచి మనసుతో ఆమె చేస్తున్న సహాయం అందరి హృదయాలను గెలుచుకుంది. ఇప్పటికే ఆర్థిక […]

Update: 2020-04-27 04:56 GMT

దిశ వెబ్ డెస్క్: లాక్డౌన్ వేళ.. ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది పేదల కడుపు నింపుతోంది హీరోయిన్ ప్రణీత. కుడ చేత్తో చేసిన దానం .. ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు పెద్దలు. అంటే మనం చేసే దానం పదిమందికి తెలియాల్సిన అవసరం లేదని, చేసిన దానం ఆ క్షణం మరిచిపోవాలని అర్థం. హీరోయిన్ ప్రణీత అదే చేస్తోంది. ప్రచారానికి దూరంగా ఉంటూ, మంచి మనసుతో ఆమె చేస్తున్న సహాయం అందరి హృదయాలను గెలుచుకుంది. ఇప్పటికే ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రణిత.. లాక్‌డౌన్ కష్టాలు మరింత పెరిగాక పేదలను ఆదుకునేందుకు స్వయంగా ఆమె వంటలు చేస్తూ, ఆహారం పంచి పెడుతూ.. తన వంతు సాయం చేస్తున్నారు.

'అత్తారింటికి దారేది' సినిమాతో తెలుగునాట గుర్తింపు దక్కించుకున్న ప్రణిత. ఆ తర్వాత కన్నడనాట బిజీ హీరోయిన్ గా మారింది. లాక్డౌన్ ప్రకటించగానే ఆర్థికంగా సాయం చేసిన ప్రణీత, ఆ తర్వాత కూడా తన సేవలను కొనసాగించింది. పేదలకు, ఉపాధి కోల్పోయిన వారికి తన వంతుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది. లాక్డౌన్ మరింత పొడిగించడంతో.. తానే స్వయంగా వంట చేస్తూ వాటిని పంపిణీ చేస్తోంది. గత 21 రోజుల్లో ఏకంగా 75 వేల మందికి భోజనం పెట్టింది. ప్రణీత చేస్తున్న మంచి పనులు .. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయంలో అందరికీ తెలిసింది. దాంతో ప్రణీత చేస్తున్నసేవలు నెటిజన్లను ఆకట్టుకుంది.

tags : pranitha , heroine, telugu cinema, social service, food, hungry people, poor people,

Tags:    

Similar News

టైగర్స్ @ 42..