2గంటలకు ప్రణబ్ అంతిమయాత్ర..

దిశ, వెబ్‌డెస్క్ : మెదడు శస్ర్తచికిత్స అనంతరం డీప్ కోమాలోకి వెళ్లిపోయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ఆయన పార్ఠివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం రాజాజీ మార్గం గుండా ఢిల్లీలోని అధికారిక నివాసానికి తరలించారు. ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయానికి నివాళ్లర్పించేందుకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వెళ్లనున్నారు. ఉదయం 11-12గంటల మధ్యలో ప్రజలు ప్రణబ్ […]

Update: 2020-09-01 01:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

మెదడు శస్ర్తచికిత్స అనంతరం డీప్ కోమాలోకి వెళ్లిపోయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ఆయన పార్ఠివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం రాజాజీ మార్గం గుండా ఢిల్లీలోని అధికారిక నివాసానికి తరలించారు.

ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయానికి నివాళ్లర్పించేందుకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వెళ్లనున్నారు. ఉదయం 11-12గంటల మధ్యలో ప్రజలు ప్రణబ్ భౌతిక కాయాన్ని దర్శించవచ్చునని తెలుస్తోంది. 12గంటలకు గార్డ్ ఆఫ్ హానరల్ అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఆయన అంతియయాత్ర ప్రారంభం కానుంది.

Tags:    

Similar News