ప్రకాశం జిల్లాలో సీఎం జగన్
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి, సిద్ధార్థ్‌ల వివాహ రిసెప్షన్‌కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. రిసెప్షన్ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అనంతరం […]
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి, సిద్ధార్థ్‌ల వివాహ రిసెప్షన్‌కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. రిసెప్షన్ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ఎర్రగొండపాలెం నుంచి తాడేపల్లి బయలుదేరి వెళ్ళిపోయారు.