ప్రకాశం బ్యారేజీ 70గేట్లు ఎత్తివేత
దిశ, ఏపీ బ్యూరో: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలో వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కు 7లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 16.7 అడుగులకు చేరడంతో సోమవారం 70గేట్లను ఎత్తి సముద్రానికి నీళ్లు వదిలారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పులిచింతల రిజర్వాయర్ నుంచి 14గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదిలారు. బ్యాక్‌వాటర్‌తో పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. […]
దిశ, ఏపీ బ్యూరో: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలో వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కు 7లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 16.7 అడుగులకు చేరడంతో సోమవారం 70గేట్లను ఎత్తి సముద్రానికి నీళ్లు వదిలారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పులిచింతల రిజర్వాయర్ నుంచి 14గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదిలారు. బ్యాక్‌వాటర్‌తో పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, సింహాద్రి, రమేష్ బాబు, కలెక్టర్ ఇంతియాజ్ బ్యారేజ్ వద్ద పరిస్థితులను సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.