వారికి అదిరిపోయే ఆఫర్.. ఆ పథకంతో ఈజీగా రూ. 3 లక్షల లోన్..
దిశ, వెబ్‌డెస్క్ : మత్యకారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే మహిళలకోసం, ఆర్థికంగా వెనుకబడిన వారికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే కుల వృత్తులను ప్రోత్సహిస్తూ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది అదే పీఎమ్ఎమ్ఎస్‌వై పథకం. దీని ద్వారా మత్స్య కారుల కుటుంబాలకు ఆర్థికంగా చేయుతనివ్వడంతో పాటు వారి ఆర్థికభివృద్ధికి ఈ పథకం ఎంతో తోడ్పడుతుంది. పథకంలోని ప్రధానాంశాలు.. ఈ పథకం 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 […]
దిశ, వెబ్‌డెస్క్ : మత్యకారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే మహిళలకోసం, ఆర్థికంగా వెనుకబడిన వారికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే కుల వృత్తులను ప్రోత్సహిస్తూ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది అదే పీఎమ్ఎమ్ఎస్‌వై పథకం. దీని ద్వారా మత్స్య కారుల కుటుంబాలకు ఆర్థికంగా చేయుతనివ్వడంతో పాటు వారి ఆర్థికభివృద్ధికి ఈ పథకం ఎంతో తోడ్పడుతుంది.
పథకంలోని ప్రధానాంశాలు..
- ఈ పథకం 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు వర్తిస్తుంది.
- పీఎమ్ఎమ్ఎస్‌వై పథకం 5 సంవత్సరాలు అమలు చేస్తారు.
- మత్స్య కార్మికులు, చేపల వ్యాపారులు, మత్స్య రంగానికి సంబంధించిన ఇతర వ్యక్తులు కూడా ఈ స్కీమ్ నుండి లబ్ధి పొందవచ్చు.
- సంవత్సరానికి 9 శాతం చొప్పున మత్స్య రంగం పెంపుతో 2024-25 నాటికి 22 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం నెరవేరుతుంది.
పథకంతో లాభం ఏంటీ..
చేపల పెంపకం ఇదో కుల వృత్తి. చాలా మంది దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే ఇలా చేపల పెంపకంపై ఆధారపడిన వారికి చేయూతనందించడానికి, చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం ద్వారా మత్స్య కార్మికులకు రూ.3 లక్షల రుణ సౌకర్యాన్ని అందించింది ప్రభుత్వం. దీన్ని మత్స్యకారులు సహాయక సంఘాలు, మత్స్య రంగం, మత్స్య సహకార సంఘాలు, మత్స్యకార సంఘాలు కూడా రుణాన్ని పొందవచ్చు. ఇక తక్కువ వడ్డితో ఈ రుణాన్ని తీసుకొని కార్మికులు తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగ పడుతోంది.