పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన

దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శనివారం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్​అయ్యర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం​పరిశీలించింది. కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే, క్రస్ట్‌ గేట్ల అమరిక పనుల గురించి ఇంజనీర్లు వివరించారు. రెండ్రోజుల పాటు పోలవరంలోనే పర్యటించనున్న పీపీఏ బృందం పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, స్పిల్‌వే బ్రిడ్జి కాంక్రీటు పనులు, స్పిల్‌వే రేడియల్‌ గేట్ల అమరిక, అప్రోచ్‌ పనులు, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం, కుడి ప్రధాన కాలువ […]

Update: 2020-12-20 08:10 GMT

దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శనివారం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్​అయ్యర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం​పరిశీలించింది. కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే, క్రస్ట్‌ గేట్ల అమరిక పనుల గురించి ఇంజనీర్లు వివరించారు. రెండ్రోజుల పాటు పోలవరంలోనే పర్యటించనున్న పీపీఏ బృందం పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, స్పిల్‌వే బ్రిడ్జి కాంక్రీటు పనులు, స్పిల్‌వే రేడియల్‌ గేట్ల అమరిక, అప్రోచ్‌ పనులు, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను ఈ బృందం తెలుసుకోనుంది.

Tags:    

Similar News