మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ఏపీ.. రాబోయే ఆరు నెలలకు రూట్ మ్యాప్ రెడీ

మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోంది...

Update: 2024-12-25 15:55 GMT

దిశ, వెబ్ డెస్క్: మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పయనిస్తోంది. ఇందుకోసం ఆరు నెలల ముందు నుంచే కసరత్తులు ప్రారంభించింది. వచ్చే ఆరు నెలలకు రూట్ మ్యాప్ రెడీ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ‘ఒక పాఠశాల-ఒక యాప్‌'(One school – one app) పేరుతో సమగ్ర డాష్‌ బోర్డ్‌(Dash board) ఏర్పాటు చేస్తోంది. ఇంటర్‌ విద్య(Inter education)కు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 1 నుంచి 12వ తరగతి వరకు కొత్త యూనిఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా టెక్ట్స్‌బుక్స్‌తో పాటు మెటీరియల్‌ ఇచ్చేదానిపైనా దృష్టి ఇప్పటి నుంచే పెట్టింది.

అటు గేమ్స్ పైనా దృష్టి సారింది. రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఎక్స్ పో, జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ నేతృత్వంలో స్టోర్స్/గేమ్స్ మీట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరం చివరి పని దినం రోజున మరోమారు మెగా పీటీఎమ్ నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా విద్యా ప్రమాణాల మెరుగుదలపై చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే 2025-2026 విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అందించే పుస్తకాల పాఠ్యాంశాల్లో సమూల మార్పు తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 

Tags:    

Similar News