పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!
దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే చాలు ఆయన అభిమానులు పొంగిపోతుంటారు. ఆయన ఒక్కసారి బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. టాకీసులు విజిల్స్‌తో దద్దరిల్లాల్సిందే.. గాల్లో పేపర్లు ఎగరాల్సిందే. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన పవన్.. ‘వకీల్‌సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాగా, ప్రస్తుతం.. పవర్ స్టార్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఏడాది జనసేనాని ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నారని ఖుషీగా ఉన్నారట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు […]
దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే చాలు ఆయన అభిమానులు పొంగిపోతుంటారు. ఆయన ఒక్కసారి బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. టాకీసులు విజిల్స్‌తో దద్దరిల్లాల్సిందే.. గాల్లో పేపర్లు ఎగరాల్సిందే. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన పవన్.. ‘వకీల్‌సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాగా, ప్రస్తుతం.. పవర్ స్టార్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఏడాది జనసేనాని ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నారని ఖుషీగా ఉన్నారట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే వేణుశ్రీరామ్ దర్శకత్వంలో వస్తోన్న ‘వకీల్‌సాబ్’ షూటింగ్ పూర్తి కాగా, ఇటీవల రిలీజైన టీజర్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’కి రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. ఈ మూవీ సమ్మర్ సీజన్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
‘వకీల్‌సాబ్’ సినిమా చేస్తూనే.. క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేశారు పవన్. ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడగా.. త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం. దీంతో పాటు మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు పవర్ స్టార్. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ఈ మధ్య స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్టవుతుందని టాక్. ‘వకీల్‌సాబ్’ రిలీజైన కొద్ది రోజులకే ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతాయట. ఇందుకు షూటింగ్‌లు ప్యారలల్‌గా పూర్తి చేసేందుకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారట పవన్. అన్ని అనుకున్నట్లు జరిగితే మూడు మూడు నెలల గ్యాప్‌తో మూడు సినిమాలు రిలీజ్ చేయాలన్నది ఫిల్మ్ మేకర్స్, పవన్ ఆలోచనని వినికిడి. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.