అంధకారంలో 500 కుటుంబాలు

దిశ, తెలంగాణ బ్యూరో: వరదలు తగ్గుముఖం పట్టినా గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ కష్టాలు తీరడం లేదు. ఇప్పటికీ వరద నీటిలోనే 45 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. వాటి పరిధిలో సుమారు 500 వరకు కుటుంబాలు అంధకారంలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. నీటిని తొలగించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీపై ఉన్నది. ఆ కుటుంబాలకు కరెంట్ కష్టాలు మొదలై వారం రోజులు దాటిపోయింది. అయినా నీటిని తొలగించకపోవడంతో అక్కడ విద్యుత్ అందించే అవకాశాలు లేవని విద్యుత్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ నీటిని తొలగిస్తేగానీ విద్యుత్ […]

Update: 2020-10-21 23:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వరదలు తగ్గుముఖం పట్టినా గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ కష్టాలు తీరడం లేదు. ఇప్పటికీ వరద నీటిలోనే 45 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. వాటి పరిధిలో సుమారు 500 వరకు కుటుంబాలు అంధకారంలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. నీటిని తొలగించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీపై ఉన్నది. ఆ కుటుంబాలకు కరెంట్ కష్టాలు మొదలై వారం రోజులు దాటిపోయింది. అయినా నీటిని తొలగించకపోవడంతో అక్కడ విద్యుత్ అందించే అవకాశాలు లేవని విద్యుత్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ నీటిని తొలగిస్తేగానీ విద్యుత్ సరఫరాకు పునరుద్ధరణ పనులు చేసే మార్గంలేని పరిస్థితి. అయితే, ఆ నీళ్లు తొలగించడంలో బల్దియా అధికారులు సఫలం కాలేకపోతున్నారు.

25 కాలనీల్లో నో..పవర్..

గత వారం రోజులుగా 20 అపార్ట్‌మెంట్లు, 25 కాలనీల ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగి ఉన్నాయి. వీరికి నేటికీ విద్యుత్ సరఫరా లేదు. మొత్తం గ్రేటర్ నగరంలో మొత్తం 1,17,787 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా 1,215 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు వరదలతో మరమ్మతులకు చేరుకున్నాయి. అందులో 1,170 ట్రాన్స్‌ఫార్మర్లు గుర్తించి వాటిని తిరిగి పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 45 ట్రాన్స్‌ఫార్మర్లు మాత్రం నీటిలోనే ఇప్పటికీ ఉన్నాయి. గ్రేటర్‌లో 286 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు ఉండగా అందులో 15 సబ్ స్టేషన్లు వరద నీటితో మునిగాయి. వాటిని వెంటనే మరమ్మతులు చేసి పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 11 కేవీ ఫీడర్ లైన్లు 2,927 ఉండగా అందులో 754 వరద ప్రభావానికి గురి కాగా, మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 8.73 లక్షల విద్యుత్ స్తంభాలుంటే అందులో 1,296 స్తంభాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 1,264 స్తంభాలకు ఈపాటికే మరమ్మతులు చేయగా మిగిలిన 32 స్తంభాలను వినియోగంలోకి తీసుకురావడమో, తిరిగి కొత్తవాటిని ఏర్పాటు చేయడమో జరుగుతుందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News