ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ వాయిదా
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో జడ్జిలు, న్యాయవాదులతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను మెయిన్ పిటిషన్‌కు జత చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రెండ్రోజుల్లో అనుసంధాన పిటిషన్ వేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అఫిడవిట్‌లో తెలిపిన పేర్లు ప్రస్తుతం బయటకు చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.