ఉద్యోగులే పిటిషన్ వేస్తే ఎలా?
దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు అనుమతి ఇచ్చే పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కూల్చివేత కవరేజ్ చేయడానికి ఒక ఉద్యోగి పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టిన ప్రభుత్వం తరఫు న్యాయవాది అడ్వొకేట్ జనరల్ ఆ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వివరించారు. కంపెనీ భాగస్వాములు కాకుండా ఉద్యోగులు పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కంపెనీ భాగస్వాములు ఈ విచారణలో ఇంప్లీడ్ అయ్యేలా మరో పిటిషన్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం కూల్చివేత కవరేజ్ కోసం మీడియాకు అనుమతి ఇచ్చే పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కూల్చివేత కవరేజ్ చేయడానికి ఒక ఉద్యోగి పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టిన ప్రభుత్వం తరఫు న్యాయవాది అడ్వొకేట్ జనరల్ ఆ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వివరించారు. కంపెనీ భాగస్వాములు కాకుండా ఉద్యోగులు పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కంపెనీ భాగస్వాములు ఈ విచారణలో ఇంప్లీడ్ అయ్యేలా మరో పిటిషన్ దాఖలు చేయడానికి గడువు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీనికి సమ్మతించిన డివిజన్ బెంచ్ సోమవారం లోపు ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.