పాకిస్తాన్‌లో మోడీ, అభినందన్‌ల పోస్టర్లు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా పీఎంఎల్ఎన్ పార్టీ నేత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోడీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ల పోస్టర్లు దాయాది దేశంలో వెలిశాయి. బాలాకోట్ దాడుల సమయంలో పాకిస్తాన్‌కు చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అప్పుడు విదేశాంగ మంత్రి చెప్పినప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావెద్ బజ్వా కాళ్లు వణికినట్టు పీఎంఎల్ఎన్ నేత సర్దార్ అయాజ్ సాదిఖ్ […]
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా పీఎంఎల్ఎన్ పార్టీ నేత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోడీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ల పోస్టర్లు దాయాది దేశంలో వెలిశాయి. బాలాకోట్ దాడుల సమయంలో పాకిస్తాన్‌కు చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అప్పుడు విదేశాంగ మంత్రి చెప్పినప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావెద్ బజ్వా కాళ్లు వణికినట్టు పీఎంఎల్ఎన్ నేత సర్దార్ అయాజ్ సాదిఖ్ పార్లమెంటులో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి పదింటికి పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసి ఉండేదని తెలియగానే బజ్వాకు చెమలు పట్టాయని వివరించారు. ఈ కామెంట్లను నిరసిస్తూ సాదిఖ్‌ను ద్రోహిగా చిత్రిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి. పాకిస్తాన్ భయపడి విడుదలచేయలేదని, శాంతికి సూచనగా ఆ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ విదేశాంగ శాఖ స్పందించిన సంగతి తెలిసిందే.